YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దూకుడు పెంచిన వైసీపీ అధినాయకత్వం

దూకుడు పెంచిన వైసీపీ అధినాయకత్వం

ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్ దూకుడు పెంచారు. విజయవాడ టూర్ లో మాంచి జోష్ తో కనిపించారు. రాజధాని ప్రాంతం కావడంతో కాన్ఫిడెన్స్ ప్రదర్శనకు ప్రాధాన్యతనిచ్చారు. టోటల్ గా తన బలం, ప్రాబల్యం చూపుకునేందుకు యత్నించారు. బెజవాడలో జగన్ తీరు పరిశీలిస్తే.. ఆయనలో దూకుడు కనిపించింది. ఓ రకంగా బలప్రదర్శన చేశారనే చెప్పొచ్చు. ఈ దూకుడును కంటిన్యూ చేయాలనే జగన్ పట్టుమీద ఉన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ ఈ తరహా జోష్ తోనే ఆయన ముందడుగేసే అవకాశాలున్నాయి. ప్రజాసంకల్ప యాత్రతో ప్రజలకు టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ టూర్ తో క్షేత్రస్థాయిలో మద్దతు కూడగట్టే యత్నాలు ముమ్మరం చేశారు. అధికార టీడీపీపై విమర్శలతో విరుచుకుపడుతూ ప్రభుత్వ లోటుపాట్లను ఎండగడుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ చేరుకున్న జగన్ యాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలోనే తరలివచ్చారు. జగన్ ర్యాలీలకు ప్రజలను కూడగట్టడంలో స్థానిక వైసీపీ శ్రేణులు బాగానే పనిచేశాయి. 

జగన్ విజయవాడ యాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే రాజధాని ప్రాంతం కావడం, ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వ విధానాలను జగన్ ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నారు. భూసేకరణ నుంచి రాజధాని రూపురేఖలపై అసంతృప్తి వెళ్లగక్కారు. మూడున్నరేళ్లలో అమరావతికి చేసిందేమీ లేదని అంటున్నారు. దీనికి తోడు ఆయనతో పాటూ వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. రెండు దఫాలుగా వారు సభలో కనిపించింది లేదు. శాసన సభలో ప్రజా సమస్యలపై చర్చింది లేదు. ఇలాంటి తరుణంలో జగన్ విజయవాడకు రావడం ఆసక్తిగా మారింది. మూడేళ్లుగా మారుతున్న రాజకీయ పరిణామాలు వైసీపీపై తీవ్ర ప్రభావం చూపాయి. 20 మందికిపైగా ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరారు. దీంతో పార్టీ బలం క్షీణించింది. ఈ లోటును పూడ్చుకునేందుకు జగన్ యత్నిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో వీలైనన్ని ప్రాంతాల్లో పర్యటించి పార్టీకి ప్రజామద్దతు కూడగట్టాలన్నది ఆయన ప్లాన్. 

Related Posts