YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: హోంశాఖ‌ ఆదేశం

భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: హోంశాఖ‌ ఆదేశం

న్యూ ఢిల్లీ  సెప్టెంబర్ 2  
ఎల్ఏసీ వ‌ద్ద టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ ఇవాళ కేంద్ర హోంశాఖ‌ ఆదేశాలు జారీ చేసింది. ఇండో-చైనా బోర్డ‌ర్‌తో పాటు, ఇండియా-నేపాల్‌, ఇండో-భూటాన్ స‌రిహ‌ద్దుల్లో బ‌ల‌గాలు అన్నీ అల‌ర్ట్‌గా ఉండాల‌ని హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. చైనాతో స‌రిహ‌ద్దు ఉన్న ప్రాంతాల్లో మ‌రింత గ‌స్తీని పెంచాల‌ని ఇండో టిబెట్ బోర్డ‌ర్ పోలీస్‌(ఐటీబీపీ), స‌హ‌స్త్రా సీమా బ‌ల్‌(ఎస్ఎస్‌బీ)కు ఆదేశాలు జారీ చేసింది. ఉత్త‌రాఖండ్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ల‌డ‌ఖ్‌, సిక్కిం స‌రిహ‌ద్దుల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ ఐటీబీపీ ద‌ళాల‌కు ఆదేశాలు ఇచ్చారు. ఉత్త‌రాఖండ్‌లోని కాలాపాని జంక్ష‌న్ వ‌ద్ద గ‌స్తీ ముమ్మ‌రంగా నిర్వ‌హించాల‌ని ఎస్ఎస్‌బీ, ఐటీబీపీల‌కు ఆదేశించారు. ఇండో నేపాల్ స‌రిహ‌ద్దుకు ఎస్ఎస్బీ అద‌న‌పు బ‌ల‌గాల‌ను పంపించారు. జ‌మ్మూక‌శ్మీర్‌, ఢిల్లీలో ఉన్న వారిని స‌రిహ‌ద్దుకు త‌ర‌లించారు. ఉన్న‌త స్థాయి స‌మావేశంలో కేంద్ర హోంశాఖ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఎల్ఏసీ వెంట‌ ప‌ర్వ‌త శ్రేణుల వ‌ద్ద ఉన్న ద‌ళాలు వెనక్కి రావ‌ద్దు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు.  పాన్‌గాంగ్ సో స‌రస్సు, రీజాంగ్ లా, రీక్విన్ లా, స్పాన్‌గుర్ గాప్ ప్రాంతాల్లో ఆక్ర‌మ‌ణ‌కు ప్ర‌య‌త్నించిన చైనా ద‌ళాల‌ను భార‌తీయ ఆర్మీ అడ్డుకున్న‌ది. ఆగ‌స్టు 29, 30 తేదీల్లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లోని పాన్‌గాంగ్ వ‌ద్ద ఉన్న కీల‌క స్థావ‌రాల‌కు భార‌త్ ఆయుధాల‌ను త‌ర‌లించింది.

Related Posts