YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నాగరాజు లాకర్ లో నోట్ల కట్టలు

నాగరాజు లాకర్ లో నోట్ల కట్టలు

హైద్రాబాద్, సెప్టెంబర్ 3, 
కీసర మాజీ తహాసిల్దార్ నాగరాజు బ్యాంక్ లాకర్లపై సస్పెన్స్ వీడింది. ఏసీబీ సోదాల్లో అధికారులకు దొరికిన బ్యాంక్ లాకర్ కీ తో అల్వాల్ సౌత్ ఇండియాన్ బ్యాంక్ లో లాకర్ ను తెరిచారు. చేతి గోల్డ్ వాచ్ సహా కిలోనర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 57.6 లక్షల ఉంటుందని తెలిపారు అధికారులు.మేడ్చల్‌ జిల్లా కీసర మాజీ తహసీల్దార్‌‌ నాగరాజు అవినీతి కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నాగరాజు బ్యాంక్‌ లాకర్‌‌ నుంచి రూ.57.6 లక్షల విలువ చేసే 1.5కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అల్వాల్‌లోని సౌత్‌ ఇండియన్‌ బ్యాంకులో లాకర్ ఉన్నట్టు గుర్తించి సోదాలు చేశారు అధికారులు. లాకర్ తెరవడంతో కీలోన్నర బంగారం గుర్తించారు. వాటిలో చేతి గోల్డ్ వాచ్, డైమండ్‌ నెక్లెసులు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.బ్యాంక్ లో నాగరాజు బంధువు జిజే నరేందర్‌‌ పేరుతో లాకర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బంధువు పేరిట నిర్వహిస్తున్న లాకర్‌‌ను ఓపెన్‌ చేశారు అధికారులు. బ్యాంక్‌ మేనేజర్‌‌తో పాటు నరేందర్ స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసింది ఏసీబీ. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను ఏసీబీ కోర్టులో డిపాజిట్‌ చేశారు. రాంపల్లి దయారా ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌లో రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ నాగరాజు ఏసీబీకి దొరికారు.ఈ కేసులో నాగరాజు సహా వీఆర్‌‌ఏ నాయిరాజ్‌,సత్యడెవలర్‌‌ శీనాథ్‌,రియల్టర్‌‌ అంజిరెడ్డిని ఏసీబీ మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారించింది. ప్రస్తుతం కేసులో పట్టుబడ్డ నిందితులంతా చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. ఐతే కస్టడీలో నాగరాజు ఏసీబీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

Related Posts