YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

139 మంది అత్యాచారం కేసు... న్యాయస్థానంలోనూ 164 స్టేట్ మెంట్ రికార్డుకు సన్నాహాలు

139 మంది  అత్యాచారం కేసు... న్యాయస్థానంలోనూ 164 స్టేట్ మెంట్ రికార్డుకు సన్నాహాలు

హైదరాబాద్ సెప్టెంబర్ 3  
ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 139 మంది  తనపై 5 వేల  సార్లు అత్యాచారం చేశారని 25 ఏళ్ల దళిత యువతి ఇచ్చిన ఫిర్యాదు  సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనితో ఇప్పటి వరకు బాధితురాలికి అండగా ఉంటూ వచ్చిన  స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడే ప్రధాన నిందితుడిగా మారనున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో బాధితురాలి నుంచి మరోసారి వాంగ్మూలం నమోదు చేయాలని సీసీఎస్ పోలీసులు  నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానంలోనూ స్టేట్మెంట్ రికార్డు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 11 ఏళ్లుగా   తనపై అత్యాచారం చేశారంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో మొదట పంజగుట్ట  పీఎస్ లో కేసు నమోదైంది. ఈ కేసులో కొందరు ప్రముఖులు కూడా నిందితుల జాబితాలో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి బదిలీ అయింది. ఈ కేసు దర్యాప్తు కోసం సీసీఎస్ మహిళ ఠాణా ఏసీపీ శ్రీదేవిని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నియమించారు. ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా చేస్తుండగానే  బాధితురాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలు మళ్లీ సంచలనంగా మారాయి.
దీన్ని పరిగణనలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఈ కేసులో డాలర్ భాయ్ ని ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. బాధితురాలి నుంచి గతంలో ఓసారి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. అయితే అప్పుడు భాదిత యువతి చెప్పిన వివరాలకు తాజాగా విలేకరుల సమావేశంలో వెల్లడించిన వాటికి చాలా తేడా ఉంది. దీంతో బాధితురాలి నుంచి మరోసారి స్టేట్ మెంట్ రికార్డు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ఈ కేసు నిందితుల జాబితాలో మార్పు చేయనున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఆమెతో న్యాయస్థానంలోనూ 164 స్టేట్ మెంట్ రికార్డు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మాజీ భార్య ఫిర్యాదుతో ఇప్పటికే డాలర్ భాయ్ పై సీసీఎస్ మహిళా పీఎస్ లో ఓ కేసునమోదైంది. ఇటీవల జరిగిన ఫోన్ బెదిరింపుల నేపథ్యంలో నల్లగొండలో డాలర్ భాయ్ పై  తాజాగా మరో కేసు నమోదైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆమె గత 13 రోజుల క్రితం ఈ విషయాన్ని బయటపెడుతూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేయడం ఆ ఫిర్యాదులో పలువురు రాజకీయ సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉండటం తో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత ఈ కేసు పలు మలుపులు తిరిగింది. మొదట సినీ ప్రముఖులు కూడా తనపై అఘాయిత్యం చేసారని చెప్పిన ఆ యువతీ ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ ప్రెషర్ మూలంగానే తాను 139 మంది పేర్లతో ఫిర్యాదు చేశానని బాధితురాలు చెప్పింది. ఇందులో కొందరికి సంబంధం లేదని చెప్పినా కూడా వినకుండా తనను ఫిజికల్గా మెంటల్గా టార్చర్ పెట్టి బెదిరింపులకు పాల్పడి తనతో ఈ కంప్లైంట్ పెట్టించాడని తెలిపింది.

Related Posts