YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నవ్యాంధ్రకు చేయూతనివ్వండి

నవ్యాంధ్రకు చేయూతనివ్వండి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్రప్రభుత్వం చెప్తోంది. అయితే నిధులు మాత్రం సక్రమంగా ఇవ్వడంలేదు. అనేక కండిషన్లతో కాలం వెళ్లదీస్తోంది. ఇదిలాఉంటే రాష్ట్రానికి రావాల్సిన భారీ ప్రాజెక్టులనూ కేంద్రం అడ్డుకుంటోందని.. బీజేపీ లేదా.. బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మేలు జరిగేలా యత్నిస్తోందని టీడీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తరపున అమలు చేయాల్సిన అభివృద్ధి పనుల్లోనూ రాష్ట్రం పట్ల వివక్ష ఉంటోందని అంటున్నాయి. కేంద్రం వైఖరి వల్ల  బడా ప్రాజెక్టుల విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరిగిందని చెప్తున్నాయి. దాదాపు రూ.3 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టే కంపెనీఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోయిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. చమురు ఎగుమతుల్లో అగ్రగామి అయిన సౌదీ సంస్థ అరంకో. ఈ సంస్థను ఏపీకి తీసుకురావటానికి ఏడాదిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన విశాఖలోని బంగాళాఖాతం తీరాన్ని పరిశీలించాల్సిందిగా ఆ సంస్థ అధిపతిని కోరారు. అరంకో రిఫైనరీ ఏపీకి రావడం ఖాయం, ఒప్పందం కూడా జరుగుతుందని అనుకుంటున్న దశలో ఈ సంస్థ మహారాష్ట్రకు వెళ్లిపోయిందని తెలుగుదేశం వర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. 

యాపిల్ సంస్థ కూడా, దాదాపు మన రాష్ట్రంలో తిరుపతికి వస్తుంది అని వార్తలు వచ్చాయి, ఎంఓయి కుదుర్చుకుంటుంది అనే టైంలో, యాపిల్ సంస్థ మహారాష్ట్ర వెళ్ళిపోయింది. కేంద్ర స్థాయిలో సాగించిన ఒత్తిళ్ల వల్లే అరంకో, యాపిల్ సంస్థలు మహారాష్ట్రకు వెళ్లి ఉంటాయని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. భారత్‌మాల ప్రాజెక్టులోనూ ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని చెప్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు.. మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దఎత్తున ప్రాజెక్టులు ఇచ్చి నవ్యాంధ్యకు చిల్లర పడేసినట్లుగా విదిల్చారని పలువురు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌తో భారత్‌మాలను నింపేశారు బీజేపీ పెద్దలు. అయితే ఆర్థికాభివృద్ధి కారిడార్‌, ఫీడర్‌, ఇంటర్‌ కనెక్టివిటీ, ఎక్స్‌ప్రెస్‌ వేల జాబితాలో ఏపీ రాష్ట్రం దాదాపు మాయమైంది. తీరప్రాంత రహదారుల్లో.. అదీ విదేశీ నిధులతో చేపట్టే ప్రాజెక్టుల కింద రెండే రెండు ప్రాజెక్టులు ప్రతిపాదించారు. అత్యంత కీలకమైన అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేకు చోటు లేకపోవడం రాష్ట్రవాసుల్లో అసంతృప్తిని పెంచేసింది. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం స్పందించి నవ్యాంధ్ర అభివృద్ధికి కృషి చేయాలని అంతా కోరుతున్నారు.

Related Posts