YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

విమానం రెక్కపై వాకింగ్ చేసిన మహిళ!

విమానం రెక్కపై వాకింగ్ చేసిన మహిళ!

ఉక్రెయిన్ సెప్టెంబర్ 3
ఓ మహిళ విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి విమానం రెక్కపైకి వెళ్లి అటూ ఇటూ వాకింగ్ చేసింది. రెక్కపై కాసేపు సేద తీరింది. ఆమెను అక్కడ చూసి విమానంలోని సిబ్బంది బిత్తర పోయారు.అక్కడికి ఎందుకు వెళ్ళావంటే గాలి ఆడట్లేదు.అందుకే వాకింగ్ చేస్తున్నా అని సమాధానం ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు వీడియోలు బయటకు రావడంతో అవి వైరల్ గా మారాయి. ఇవి చూసిన వారు గాలి ఆడట్లేదని ఇలా కూడా చేస్తారా..అవాక్కవుతున్నారు. విమానం రెక్కపై వాకింగ్ చేయడం ఏంట్రా.. బాబూ అని షాకవుతున్నారు. ఇది విమానం ల్యాండ్ అయినప్పుడు జరిగింది కానీ.. లేదంటే ఏంటి పరిస్థితి అని తలగోక్కుంటున్నారు. ఈ సంఘటన ఉక్రెయిన్ లో జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో టర్కీకి వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేసిన అనంతరం ఓ బోయింగ్ విమానంలో తిరిగి బయలుదేరారు. మార్గ మధ్యంలో ఆ విమానం ఉక్రెయిన్ లోని కైవ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ సమయంలో ఆ మహిళ విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి విమానం రెక్క మీదకు చేరుకుని అటూ ఇటూ తిరగడం మొదలు పెట్టింది. కాసేపు రెక్కపై కూర్చుంది. ఆమె చర్యలు గమనించిన విమాన సిబ్బంది పరుగు పరుగున ఆమె వద్దకు వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అంటే.. పిచ్చిగా సమాధానం ఇచ్చింది. గాలి ఆడక పైకి వచ్చి వాకింగ్ చేస్తున్నట్లు చెప్పింది. ఆమె పిల్లలు అప్పటికే విమానం దిగిపోయారు కూడా. ఆ మహిళ మద్యం తాగి ఉంటుందని అందుకే ఇలా ప్రవర్తిస్తోందని అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆమె ఎటువంటి మద్యం డ్రగ్ తీసుకోలేదని నిర్ధారించారు. ఆమె మానసిక స్థితి కూడా బాగానే ఉంది. మరి ఆమె ఎందుకు అలా ప్రవర్తించిందో మాత్రం అంతు చిక్కలేదు.

Related Posts