YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇంగ్లిష్‌ మీడియం అమలులో ఏపి ప్రభుత్వానికి చుక్కెదురు హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

ఇంగ్లిష్‌ మీడియం అమలులో ఏపి ప్రభుత్వానికి చుక్కెదురు హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 3 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. గురువారం నాడు ఇంగ్లిష్‌ మీడియం అమలు విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో ఎస్‌ఎల్‌పీ, స్టేపై ప్రతివాదులకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 25కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపించారు. హైకోర్టు తీర్పుపై స్టే, నోటీస్ ఇవ్వాలని న్యాయవాది కోరారు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన చట్టంలో లేదని ఆయన అన్నారు. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన జరగాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రగతిశీలమని విశ్వనాథన్ వాదించారు. తెలుగు మీడియం విద్యా బోధన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం తీవ్రంగా తగ్గిపోతుందని సుప్రీంకోర్టుకు విశ్వనాథన్ తెలిపారు.
అయితే.. ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది శంకర్‌నారాయణ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు తెలుగు మీడియం ఎంచుకునే అవకాశాన్ని కాలరాస్తుందని సుప్రీంకోర్టుకు శంకర్ వివరించారు. తెలుగు మీడియం పాఠశాలలు పూర్తిగా కనుమరుగు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రయత్నం చేస్తున్నదని ప్రతివాదుల శంకర్‌నారాయణ న్యాయస్థానానికి తెలిపారు. ఇరువురు వాదనలు, ప్రతినాదలు విన్న సుప్రీంకోర్టు ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత స్టే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.ఇంగ్లిష్‌ మీడియం అమలుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన జీవో నెం.81, 85ను హైకోర్టు కొట్టేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడం జరిగింది. ఇవాళ దీనిపై సుప్రీంకోర్టు విచారించి స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీం తీర్పుతో జగన్ సర్కార్‌కు మరోసారి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయినట్టయ్యింది.

Related Posts