YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్ కు మరోసారి చుక్కెదురు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్ కు మరోసారి చుక్కెదురు

న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 3 
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్ కు మరోసారి చుక్కెదురైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు మతం రంగుపులుముతూ రాజకీయం చేయాలనుకున్న పాకిస్థాన్ ప్రయత్నాలను ఐరాస భద్రతా మండలి  పన్నాగం విఫలమైంది.  ఉగ్రవాద చర్యల పాల్పడుతున్నారంటూ ఇద్దరు భారతీయులను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని చేసిన ప్రయత్నం తిప్పికోట్టింది.  ఐరాస లో భారత్ కు శాశ్వత ప్రతినిధిగా ఉన్న తిరుమూర్తి తెలిపారు. అంగారా అప్పాజీ గోవిందా పట్నాయక్ అనే భారతీయులు ఉగ్రవాదులని ఆ దేశం ఆరోపించింది. మండలి లోని కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కమిటీ వీరిపై ఉగ్రవాద ముద్ర వేయాలని ఓ తీర్మానాన్ని ప్రతిపాదించింది. అయితే ఈ ఆరోపణలను భద్రతా మండలి ముందు రుజువు చేయలేకపోయింది. దీంతో సరైన ఆధారాలు ఇవ్వకపోవడంతోపాటు అసత్య ఆరోపణలు చేసిన పాకిస్థాన్ చర్యను భద్రతా మండలిలో సభ్యదేశాలైన అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ బెల్జియం అడ్డుకున్నాయి. పాక్ కుటిల యత్నాన్ని సభ్యులంతా తిరస్కరించారని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్.త్రిమూర్తి ట్వీట్ చేశారు. ఇటువంటి ప్రయత్నాలను పాక్ గతంలోనూ చేసింది. ఇద్దరు భారతీయులను తీవ్రవాద జాబితాలో చేర్చాలని గత సంవత్సరం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఏడాది ఆరంభంలో కూడా పాకిస్థాన్… అజయ్ మిస్త్రీ వేణు మాధవ్ డోంగారా అనే వ్యక్తులను టెర్రరిస్టులుగా చూపడానికి యత్నించింది.

Related Posts