ఇక కాగ్ తో ఆడిట్...
తిరుమల,
టీటీడీ నిర్ణయంపై ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. సీఎం వైఎస్ జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాలకమండలి సభ్యులు గొప్ప మనసుతో సమ్మతించారని ట్వీట్ చేశారు.
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆడిట్‌ను కాగ్ ద్వారా చేయాలని పాలకమండలి ఏపీ ప్రభుత్వానికి సిపార్స్ చేసింది. 2014-19 మధ్య టీటీడీ నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని దీనిపై కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని ఇప్పటికే ఎంపీ సుబ్రమణ్యస్వామి, సత్యపాల్ సభర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. 2014-20 వరకు ఇప్పటికే స్టేట్ ఆడిట్ డిపార్టుమెంట్ ఆడిట్ నిర్వహించినప్పటికీ దీనిపై కూడా కాగ్ ద్వారా ఆడిట్ నిర్వహించాలని పాలకమండలి ప్రభుత్వాన్ని కోరింది.ప్రతి ఏటా స్టేట్ ఆడిట్ ద్వారా ఆడిట్ జరుగుతుంది.. కానీ ఆరోపణలు రావడంతో కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని పాలకమండలి నిర్ణయించింది.
ఇదిలా ఉంటే టీటీడీ నిర్ణయంపై ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. కాగ్‌తో ఆడిట్ చేయించాలన్నది గొప్ప నిర్ణయమన్నారు. తన ప్రతిపాదనను సీఎం వైఎస్ జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాలకమండలి సభ్యులు గొప్ప మనసుతో సమ్మతించారని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు స్పందించిన వైవీ సుబ్బారెడ్డి పారదర్శకత, అవినీతిరహిత పాలన పట్ల సీఎం నిబద్ధతతో ఉన్నారని చెప్పారు.