విశాఖపట్టణం, సెప్టెంబర్ 4,
విశాఖను పాలనారాజధానిగా ముఖ్యమంత్రిగా జగన్ నిర్ణయించారు. చట్టం కూడా తెచ్చారు. న్యాయ ప్రక్రియ ముగియగానే విశాఖకు రాజధాని తరలిపోవడం ఖాయం. ఇదిలా ఉంటే విశాఖ రాజధాని కాక ముందే అనేక రికార్డులు సృష్టిస్తోంది. స్వచ్చ సర్వేక్షణ్ లో 9వ ర్యాంక్ సాధించిన విశాఖ ఇపుడు దేశంలోని పది టాప్ రిచెస్ట్ సిటీస్ లో ఒకటిగా నిలవడం నగర వాసులకు మరింత ఆనందకర మైంది. విశాఖతో పోటీ పడిన మిగిలిన నగరాలన్నీ ఆయా రాష్ట్రాల రాజధానులు కావడం విశేషం. దేశంలోనే అత్యధిక జీడీపీని సాధించే నగరాల్లో విశాఖ కూడా మొదటి పదింటిలో ఉండడమే ఇక్కడ ప్రత్యేకం.ముఖ్యమంత్రి జగన్ విపక్షంలో ఉన్నపుడే కాదు, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అంటున్న సంగతి ఒక్కటే. హైదరాబాద్ సహా దక్షిణాది రాష్ట్రాల రాజధానులతో పోటీ పడే నగరం కావాలని చెబుతున్న సంగతి విదితమే. అలా రెడీ మేడ్ నగరంగా విశాఖ ఉంది. టాప్ టెన్ రిచెస్ట్ సిటీలలో హైదరాబాద్, చెన్నై, బెంగళూర్, ముంబైల సరసన విశాఖ ఉండడం అంటే జగన్ ఆశించింది నెరవేరుతున్నట్లే. ఇక విశాఖ ఏ సపోర్టూ లేకుండానే ఈ నగరాల పక్కన తన సొంతంగానే వచ్చి చేరింది. 2020 సంవత్సరానికి గాను ఒక ప్రముఖ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు సంబంధించి చేసిన సర్వేలో ఇది వెల్లడైంది.ఇక ఒక నగరంగా ఉన్నపుడే విశాఖ టాప్ టెన్ లోకి వస్తే ఇకమీదట రాజధాని అవుతుంది. దాంతో మరింతంగా విశాఖ అభివృధ్ధి పరుగులు తీస్తుందని మేధావులు అంచనా వేస్తున్నారు. విశాఖ జీడీపీ పెరుగుదల శుభ సూచకమని కూడా అంటున్నారు. విశాఖ లాంటి నగరాల ప్రగతి దేశ జీడీపీని కూడా మరింతగా పెంచుతుందని కూడా అంటున్నారు. విశాఖ విషయంలో ఇప్పటి పాలకులు వేసుకున్న అంచనాలు కూడా కరెక్ట్ అన్న భావనను వ్యక్తం చేస్తున్నారు.ఒక నగరం అంటే పది మంది ఉపాది పొందాలి, పరిశ్రమలు రావాలి, అన్ని రకాలుగా అందరినీ అకట్టుకోవాలి. విశాఖ విషయానికి వస్తే బహుముఖీయమైన అభివృధ్ధికి విస్త్రుతమైన అవకాశాలు ఉన్నాయి. సినీ, ఐటీ పరిశ్రమలతో పాటు, టూరిజం కూడా అభివృధ్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది. దీని అల్ల జీడీపీ ఇంకా పదింతలు పెరుగుతుందని, విశాఖ జనం తలసరి ఆదాయం కూడా దేశంలోనే మేటిగా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి ఏపీకి పాలనారాధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరైనది అ అని రుజువు చేసే విధంగా తాజా ర్యాంకులు ఉన్నాయన్నది వైసీపీ నేతల మాటగా కూడా ఉంది.