YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మూడో ఫ్రంట్ కోసం క‌మ‌ల్ క‌స‌ర‌త్తు

మూడో ఫ్రంట్ కోసం క‌మ‌ల్ క‌స‌ర‌త్తు

చెన్నై, సెప్టెంబ‌ర్ 4, 
తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అయితే మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ రాష్ట్రంలో తృతీయ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటయితే అన్నాడీఎంకే, డీఎంకేలకు చెక్ పెట్టవచ్చన్నది కమల్ హాసన్ భావనగా ఉంది. అయితే ఇది ఎంతవరకూ వర్క్ అవుట్ అవుతుందనేదే ప్రశ్న. బీజేపీ, అన్నాడీఎంకే ఒక కూటమిగా ఉన్నాయి. తొలి నుంచి బీజేపీని కమల్ హాసన్ వ్యతిరేకిస్తున్నారు.ఇక డీఎంకే కూడా అధికారంలోకి రావడానికి వీల్లేదన్నది కమల్ హాసన్ అభిప్రాయం. అన్నాడీఎంకే, డీఎంకేలు కొన్ని దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతున్నా ప్రజల జీవన విధానంలో ఎటువంటి మార్పు రాలేదన్నది కమల్ హాసన్ నిశ్చితాభిప్రాయం. అయితే అదే సమయంలో కాంగ్రెస్ పట్ల కొంత సానుకూల ధోరణి ఉంది. ఒక సారి సోనియా, రాహుల్ ను కమల్ హాసన్ కలసి వచ్చారు. అయితే కాంగ్రెస్ తో కలసి తమిళనాడులో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకున్నా అది సాధ్యం కాదు.ఎందుకంటే కాంగ్రెస్ కు డీఎంకే నమ్మకమైన మిత్రుడు. దక్షిణాది రాష్ట్రాల్లో తమకు చాలాకాలంగా అంటిపెట్టుకుని ఉన్న డీఎంకే ను కాదని తమిళనాడులో సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవు. కాంగ్రెస్ కోసం కమల్ హాసన్ ఏమాత్రం ప్రయత్నం చేసినా డీఎంకే కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకోదు. ఇది కాదనలేని వాస్తవం. ఇక కమల్ హాసన్ ముందున్న ఆప్షన్ రజనీకాంత్ మాత్రమే. రజనీకాంత్ పార్టీ పెడితే ఆయనతో కలసి నడిచే వీలుంది.కమల్ హాసన్ కు మరో అవకాశం డీఎండీకేతో పొత్తు పెట్టుకోవడం. కమల్ హాసన్, రజనీకాంత్, విజయకాంత్ లు కలసి బరిలోకి దిగితే బొమ్మ అదిరిపోద్ది అనే వాళ్లు లేకపోలేదు. ఈ దిశగానే కమల్ హాసన్ ప్రయత్నాలు ఉన్నాయంటున్నారు. విజయకాంత్ కు తమిళనాడులో ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది. పైగా అన్నాడీఎంకే తో ఆయన విసిగిపోయి ఉన్నారు. ఇక రజనీకాంత్ థర్డ్ ఫ్రంట్ కు అంగీకరిస్తే అంతే చాలు. ఇప్పటి వరకూ డీఎంకే, అన్నాడీఎంకేలతో విసిగిపోయిన తమిళనాడు ప్రజలకు ఇదే అసలైన ప్రత్యామ్నాయం మాత్రం అవుతుందంటున్నారు.

Related Posts