YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

భార్య‌ను పుట్టింటికి పంపి రెండో పెళ్లి

భార్య‌ను పుట్టింటికి పంపి రెండో పెళ్లి

క‌ర్నూలు సెప్టెంబ‌ర్ 4, 
అగ్ని సాక్షిగా తాళికట్టిన భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధించడంతో పాటు గుట్టుగా రెండో పెళ్లి చేసుకున్నాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. భర్తతో పాటు అతడిని రెండో పెళ్లికి ఉసిగొల్పిన అత్తమామలపైనా చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో వెలుగుచూసింది.కల్లూరు మండలం బస్తిపాడుకు చెందిన పార్వతి అనే యువతికి దేవనకొండ మండలం బేతపల్లిలోని మేనమామ కుమారుడైన హరికృష్ణతో 2016 మార్చి 26న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఆరున్నర తులాల బంగారం, రూ.2 లక్షల నగదు కట్న కానుకల కింద అందజేశారు. ఆరు నెలల వరకు వీరి సంసారం సజావుగానే సాగింది. ఆ తర్వాతి నుంచి అదనపు కట్నం కోసం అత్తమామలు పార్వతిని వేధించడం మొదలుపెట్టారు. ఆమెకు ఆడబిడ్డకు జన్మనివ్వడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త ఆమెను పుట్టింటికి పంపేయడంతో రూ.లక్ష ఇచ్చి పంపించారు.పాపతో పాటు పుట్టింటికి వెళ్లి కొద్దిరోజులు ఉండి రావాలంటూ పార్వతిని అత్తమామలు పంపించారు. ఈ సమయంలోనే తన భర్తకు పెద్దకడుబూరు మండలం హెచ్‌.మురవన గ్రామానికి చెందిన యువతితో రెండో పెళ్లి చేశారని పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన జీవితాన్ని నాశనం చేసిన భర్త, అత్తమామలపై కఠినచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Posts