YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

న‌వంబ‌ర్ నాటికి అమెరికాలో ప్ర‌తి ఒక్క‌రికి డోసు

న‌వంబ‌ర్ నాటికి అమెరికాలో ప్ర‌తి ఒక్క‌రికి డోసు

న్యూఢిల్లీ, సెప్టెంబ‌ర్ 4, 
అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజులు ముందే అమెరికాలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ట్రంప్ యంత్రాంగం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. నవంబరు 1 నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలను ట్రంప్ యంత్రాంగం కోరింది. డల్లాస్‌కు చెందిన హోల్‌సేల్ వ్యాపారి మెక్‌కెస్సన్ కార్ప్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పంపిణీ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి కోరింది.ఈ అనుమతులను పొందడానికి అవసరమైన సాధారణ సమయం.. అత్యవసర ప్రజారోగ్య కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్యమైన అవరోధంగా నిలుస్తుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ ఆగస్టు 27న రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన సౌకర్యాల కల్పన కోసం దరఖాస్తులను వేగవంతం చేయడానికి సీడీసీ మీ సహాయం కోరుతోందని వ్యాఖ్యానించారు.అవసరాలను పరిగణనలోకి తీసుకుని నవంబర్ 1, 2020 నాటికి ఈ సౌకర్యాలు పూర్తిచేసి, సన్నద్ధంగా ఉండాలని సీడీసీ డైరెక్టర్ రాష్ట్రాలను కోరారు. వ్యాక్సిన్ విడుదలకు సంబంధించి ప్రణాళిక వివరాలను తెలియజేసే పత్రాలను రాష్ట్రాలకు అందజేసిన సీడీసీ.. అవి లైసెన్స్ పొందిన వ్యాక్సిన్‌లుగా లేదా అత్యవసర వినియోగ కింద ఆమోదిస్తామని పేర్కొంది. వ్యాక్సిన్ తొలి డోసు వేసిన కొద్ది వారాల తర్వాత బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్టు తెలిపింది.కోవిడ్ -19 టీకా పంపిణీ చేసేవారికి ఎటువంటి ఖర్చు లేకుండా సహాయక సామాగ్రిని ఫెడరల్ ప్రభుత్వం సేకరించి పంపిణీ చేయనున్నట్టు వివరించింది. న్యూయార్క్, చికాగో, హ్యూస్టన్, ఫిల్‌డెల్ఫియా, శాన్ అంటోనియోలకు కూడా ఈ లేఖను సీడీసీ పంపింది. అత్యవసర విధుల్లో పాల్గొనే సిబ్బంది, జాతీయ భద్రతా అధికారులు, సీనియర్లు, బలహీన సమూహాల సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారని న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. మొత్తం మూడు వ్యాక్సిన్‌లు అమెరికాలో ఫేజ్-3 క్లినికల్ దశలోకి ప్రవేశించాయి. వేలాది మంది ఇందులో పాలు పంచుకుంటురు.

Related Posts