"సద్గురు" గా ప్రసిద్ధులైన యోగి, మార్మికులు, ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ అనేక సామాజిక ఆభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది, అందువల్లే ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి ఆర్ధిక, సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది. ఈ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
25 సం.ల వయసులో 1982 సెప్టెంబర్ 23న, మధ్యాహ్నం మోటారు సైకిల్ పై చాముండి కొండ పైకి వెళ్ళి, ఒక రాయి పై కూర్చున్నప్పుడు, ఒక ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. అప్పుడు అతనికి కలిగిన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆయన మాటలలో - " ఆ క్షణం వరకు ఇది నేను, అది వేరొకరు అనుకునే వాడిని, కాని ఆ క్షణంలో మొదటి సారిగా, నేను ఏదో, నేను కానిదేదో నాకు తెలియ లేదు.అంతా నేనే అనిపించింది, నేను పీలుస్తున్న గాలి, నేను కూర్చున్న బండ, నా చుట్టూ ఉన్న వాతావరణం, ప్రతిదీ నేనుగా అయిపోయింది. నాకు మామూలు స్పృహ వచ్చే సరికి పది, పదిహేను నిముషాలు పట్టినట్టు అనిపించింది. కాని నాలుగున్నర గంటలు గడచింది, కళ్ళు తెరచుకునే ఉన్నాయి, పూర్తి తెలివిగానే ఉన్నాను కాని సమయం మాత్రం అలా గడచి పోయింది". ఆ అనుభవం పొందిన ఆరు వారాల తరువాత, సద్గురు తన వ్యాపారాలన్నీ స్నేహితులకు వదిలేసి తనకు వచ్చిన ఆధ్యాత్మిక అనుభవ అంతరార్ధాన్ని తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగాడు. అలా ఒక సంవత్సరకాల ధ్యానమూ, ప్రయాణాల తరువాత, సద్గురు తన అంతర్గత అనుభవాలను అందరితో పంచుకోవటానికి యోగా బోధించాలని నిర్ణయించుకున్నాడు. .
1983లో, మైసూర్ లో ఏడుగురితో మొదటి యోగా క్లాస్ ను మొదలు పెట్టాడు. కాలక్రమంలో , కర్ణాటకాలోనూ, హైదరాబాదులోనూ క్లాస్ నుండి క్లాసుకి మోటార్ సైకిల్ పైతిరుగుతూ తరగతులు నిర్వహించాడు. తన పౌల్ట్రీ ఫారంపై వచ్చే అద్దెతో జీవితం గడుపుతూ, తరగతులకు పారితోషికం తీసుకోవడానికి నిరాకరించాడు. క్లాసులలో పాల్గొనేవారు ఇచ్చే డబ్బును తరగతి ఆఖరి రోజున ఏదైనా స్ధానిక స్వచ్చంద సంస్ధకి విరాళంగా ఇవ్వడం అతని రివాజు అయ్యింది. . ఈ క్లాసుల ఆధారంగానే తరువాత ఈశా యోగా క్లాసులు రూపొందించబడ్డాయి.
1989 లో కోయంబత్తూర్ లో తన మొదటి క్లాసుని నిర్వహించాడు. దీని సమీపంలో కొన్ని రోజుల తరువాత ఈశా యోగ సెంటర్ ఏర్పాటు చేయబడింది. క్లాసులను సహజ స్ధితి యోగా అనే వారు. ఈ క్లాసులలో ఆసనాలు, ప్రాణాయామ క్రియలు, ధ్యానం భోధించేవాడు. 1993 లో సద్గురు పెరుగుతున్నఆధ్యాత్మిక సాధకులకు సహాయపడటం కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా చుట్టూ వివిధ స్ధలాలు పరిశీలించినప్పటికీ, వాటిలో ఏది నచ్చలేదు. చివరకు కోయంబత్తూరు నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెళ్ళంగిరి పర్వత పాదాల చెంత పదమూడు ఎకరాల భూమిని ఎంచుకున్నాడు. 1994 లో ఈ భూమిని కొనుగోలు చేసి ఈశా యోగ సెంటర్ ని ఏర్పాటు చేశాడు.
సద్గురు జగ్గీవాసుదేవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.