YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ధర్మాన్ని గెలిపిద్దాం...

ధర్మాన్ని గెలిపిద్దాం...

ధర్మమే గెలుస్తుంది అంటారు... అది తప్పు.. ధర్మం దానంతట అదే గెలవటం కాదు.. నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి....
ఎలాగో తెలుసుకోండి...
త్రేతాయుగంలో రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు, సరేలే ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుంది అని రాముడు చేతులు కట్టుకొని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు.. రావణాసురుడి మీదా ధర్మయుద్ధం ప్రకటించాడు. ఆ రాముడికి అఖండ వానర సైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు, ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి. తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి. నరాలు తెగి రక్తం చిందుతున్నా సరే తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు, యద్ధంలో గెలిచాడు.. ధర్మం గెలిచింది...
ద్వాపరయగంలో కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు తను దేవుడు కదా అని ఓక సామాన్య మానవుడు లా యుద్దాన్ని చూడలేదు.. ధర్మం చూసుకున్నాడు. పాండవుల పక్షాన నిలుచున్నాడు. అర్జునుడికి రథ సారధిగా మారాడు, గుర్రానికి గుగ్గిళ్లు పెట్టాడు, దాని పేడ ఎత్తేశాడు. స్నానాలు చేయించాడు.
ఆ యుద్ధంలో రథాన్ని నడుపుతూ ఆ వేగంలో వెనకాల అర్జునుడి మాటాలు వినపడవు గనుక అర్జునుడు తన కాలుతో కృష్ణుడి కటి భాగంలో ఎటువైపు తగిలిస్తే రధాన్ని అటువైపు తిప్పాలని ముందుగనే అనుకున్నారు.. అలా కాళ్ళతో కూడా తన్నించుకున్నాడు...  అవన్ని ధర్మం కోసమే చేసాడు. ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు. అలా కురుక్షేత్ర యద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది..
కలియుగం ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు సమస్యలతో పోరాడుతునే వున్నాం.. ప్రతి ఒక్కరి మదిలో మంచికి చెడుకి యుద్ధం జరుగుతునే వుంది.. నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది.. ఆచరిస్తే ధర్మం అవుతుంది. అది భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అవుతుంది.
అదే నువ్వు నా, ని, తన, మన బేధాలను పక్కన పెట్టి న్యాయం అలోచిస్తేనే ధర్మం అర్థం అవుతుంది..
అలా అలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది, తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన రోజు నీ వెనకాల ప్రపంచమే నడుస్తుంది..
మన ధర్మాన్ని కాపాడుకుందాం. మన బావితరాలకు అందిద్దాము...
 

Related Posts