YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మద్యం తెస్తూ పట్టుపడిన మద్యం దుకాణం ఉద్యోగి

మద్యం తెస్తూ పట్టుపడిన మద్యం దుకాణం ఉద్యోగి

నందిగామా సెప్టెంబర్ 04
తెలంగాణ నుంచి మద్యం అక్రమంగా రవాణా చేస్తూ  షేర్ మహమ్మద్ పేట ప్రభుత్వ మద్యం దుకాణం ఉద్యోగి అధికారులకు దొరికిపోయాడు. అక్రమంగా మద్యం రవాణా అవుతుందని వచ్చిన సమాచారం పై ఎక్సైజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో  కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామం వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడికి వచ్చని ఒక కారును ఆపి తనిఖీ చేయగా 685 తెలంగాణ మద్యం సీసాలు లభించాయి. కారులో మద్యం సీసాలు అక్రమంగా రవాణా చేస్తున్న సత్తు నాగరాజు, కరాళ వేళంగిని అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. కంచికచర్ల ఎక్సైజ్ కార్యాలయం వద్ద అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డేటా ప్రభాకర్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను విచారించగా సత్తు నాగరాజు జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడని తెలిపారు. గండేపల్లి గ్రామానికి చెందిన సంఘం విజయ్ కుమార్ అనే వ్యక్తికి మద్యం సీసాలు ఇచ్చేందుకు వస్తూ పట్టుబడ్డాడని అన్నారు.  ఒక ప్రభుత్వ మద్యం దుకాణాలు పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రం రామాపురం వైన్ షాప్ వద్ద 80 వేల రూపాయల విలువైన 685 ఓల్డ్ అడ్మిరల్ బ్లూ బ్రాండ్ మద్యం సీసాలు కొనుగోలు చేసి గండేపల్లి సంఘం విజయ్ కుమార్ వద్ద లక్ష 30 వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడని ఆయన తెలిపారు. ఎక్సైజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి మరియు ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.
=

Related Posts