YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యూనిఫాం..దిగజార్చొద్దు : మోడీ

యూనిఫాం..దిగజార్చొద్దు : మోడీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4, 
‘సింగం’ సినిమాల లాంటివి చూసి తమను తాము గొప్పగా ఊహించుకోవద్దని ట్రైనీ ఐపీఎస్ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. హైద‌రాబాద్‌లోని స‌ర్ధార్ వ‌ల్లభాయ్ ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీలో శిక్షణ ముగించుకున్న ప్రొబేషనరీ ఐపీఎస్‌ల‌ను ఉద్దేశించి శుక్రవారం (సెప్టెంబర్ 4) ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు.పోలీసు అధికారులు డ్యూటీలో కొత్తగా చేరినప్పుడు అందరూ తమకు భయపడాలని అనుకుంటారు. ముఖ్యంగా ఏరియా గ్యాంగ్‌స్టర్లు భయపడాలని భావిస్తారు. ‘సింగం’ లాంటి సినిమాలను చూసి తమను తాము గొప్పగా ఊహించుకుంటారు. దీని వల్ల అసలు కర్తవ్యాన్ని విస్మరించే ప్రమాదం ఉంది. మీరు ఇలాంటి ధోరణిని వీడాలి’ అని ట్రైనీ ఐపీఎస్ అధికారులకు ప్రధాని సూచించారు.కొత్తగా డ్యూటీలో చేరినప్పుడు అందరూ భయపడాలని అనుకుంటారు. సింగం లాంటి సినిమాలను చూసి గొప్పగా ఊహించుకుంటారు. యూనిఫాం వల్ల మీరు గర్వపడాలి, అంతేగానీ, మీ యూనిఫామ్‌కు ఉన్న అధికారాలతో మీకు అహంభావం రాకూడదు.  ప్రధాని మోద‘మీ యూనిఫాం వల్ల మీరు గర్వపడాలి. అంతేగానీ, మీ యూనిఫామ్‌కు ఉన్న అధికారాలతో మీకు గర్వం (అహంభావం) రావొద్దు. మీ ఖాకీ యూనిఫామ్‌కు ఉండే గౌరవాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు’ అని మోదీ పేర్కొన్నారు.పనిలో బాగా ఒత్తిడికి గురయ్యేవారికి యోగా, ప్రాణాయామం లాంటివి బాగా ఉపయోగపడతాయని మోదీ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఐపీఎస్ పాస్ అవుట్ అధికారులను నేరుగా కలుసుకోలేకపోతున్నానని పేర్కొన్న మోదీ.. సమయం వచ్చినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా కలుస్తానని హామీ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల్లో 28 మంది మహిళలు ఉన్నారు

Related Posts