YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాలువనే మింగే స్తున్నారు..

కాలువనే మింగే స్తున్నారు..

నగరంలోని చారిత్రాత్మక బకింగ్ హామ్ కాలువ ఆక్రమణలకు గువుతోంది.  కెనాల్‌ స్థలంలో అనధికారిక నిర్మాణాలు చేపట్టినా పట్టించుకునే వారు కరవయ్యారు. ఆక్రమణదారులకు కొందరు నేతల అండదండలు ఉండడంతో పోర్టు అధికారులు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కాలువ  గట్టు వెంట ఉన్న అక్రమ కట్టడాలపై ఇటీవల పోర్టు అధికారులు సర్వే చేపట్టారు. ఏటిమొగ నుంచి జగన్నాథపురం వంతెన వరకు  34 అక్రమ కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. చేపల వేటకు వెళ్లే బోట్లకు సంబంధించి మరమ్మతులు ఈ ప్రాంతంలో జరుగుతుంటాయి. ఓ నేత ఇక్కడ ఆక్రమిత స్థలంలో నిర్మాణాలు చేపడుతూ వాటిని అద్దెకు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

బకింగ్‌హామ్‌ కాలువ అభివృద్ధికి సంబంధించి ఓ వైపున చర్చలు జరుగుతుండగా కాలువ గట్టుపై ఆక్రమణలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.నేషల్‌ వాటర్‌వే-4 కింద నేవిగేషన్‌కు సంబంధించి వివిధ రకాల సర్వేలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో చేపల వేటకు వాడే బోట్ల తయారీకి, వాటి మరమ్మతుల కోసం గట్టును ఆక్రమిస్తున్న వైనంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.ఏటిమొగ నుంచి వార్పు రోడ్డులో ఆక్రమణలను తొలగించాలంటూ సర్వే అనంతరం పోర్టు అధికారులు కలెక్టర్‌, ఆర్డీవోలకు నివేదిక పంపారు. ఇందులో 34 మంది పేర్లతో ఉన్న ఆక్రమ కట్టడాల వివరాలను  పొందుపరిచారు. సర్వే నంబరు 467/1లో కాలువ గట్టు వెంట పలు చోట్ల ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించారు. 

గట్టు వెంట ఉన్న అక్రమ కట్టడాలపై ఇటీవల పోర్టు అధికారులు సర్వే చేపట్టారు. ఏటిమొగ నుంచి జగన్నాథపురం వంతెన వరకు  34 అక్రమ కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. చేపల వేటకు వెళ్లే బోట్లకు సంబంధించి మరమ్మతులు ఈ ప్రాంతంలో జరుగుతుంటాయి. ఓ నేత ఇక్కడ ఆక్రమిత స్థలంలో నిర్మాణాలు చేపడుతూ వాటిని అద్దెకు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.బకింగ్‌హామ్‌ కాలువ అభివృద్ధికి సంబంధించి ఓ వైపున చర్చలు జరుగుతుండగా కాలువ గట్టుపై ఆక్రమణలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.నేషల్‌ వాటర్‌వే-4 కింద నేవిగేషన్‌కు సంబంధించి వివిధ రకాల సర్వేలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో చేపల వేటకు వాడే బోట్ల తయారీకి, వాటి మరమ్మతుల కోసం గట్టును ఆక్రమిస్తున్న వైనంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.ఏటిమొగ నుంచి వార్పు రోడ్డులో ఆక్రమణలను తొలగించాలంటూ సర్వే అనంతరం పోర్టు అధికారులు కలెక్టర్‌, ఆర్డీవోలకు నివేదిక పంపారు. ఇందులో 34 మంది పేర్లతో ఉన్న ఆక్రమ కట్టడాల వివరాలను  పొందుపరిచారు. సర్వే నంబరు 467/1లో కాలువ గట్టు వెంట పలు చోట్ల ఆక్రమణలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Related Posts