అమరావతి సెప్టెంబర్ 04
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వమని అడిగితే చంద్రబాబు రైతులను బషిర్ బాగ్ లో కాల్చి చంపారు. వైస్సార్ పాలన గుర్తు చేసెల సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు బాకీ పడిన 8 వేల కోట్ల బకాయిలను మేము చెల్లించామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. రైతులకు భవిష్యత్ లో న్యాయం చేసేందుకు మెగా సోలార్ ప్రాజెక్టు చేపడుతున్నాం. రైతులు నష్ట పోకుండా ఉండాలని సబ్సిడీ నగదు చెల్లిస్తున్నాం. శాశ్వతంగా రైతులకు న్యాయం జరగాలని సబ్సిడీ చెల్లిస్తున్నాం. చంద్రబాబు వ్యవసాయం చేశాడా రైతుల కష్టాలు తెలియడానికి ? చంద్రబాబు దళారి ,బ్రోకర్ వ్యవసాయం గురించి ఏమి తెలుసో చెప్పాలి. ఆర్బికే ద్వారా రైతులకు న్యాయం చేస్తున్నాం. అచ్చెన్నాయుడుని ఎవరు హింసించారు? అచ్చెన్నాయుడు రాసిన లేఖ ఆధారంగానే అధికారులు విచారణ చేసి కేసు నమోదు చేశారు. పైల్స్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు 70 రోజులు ఉంటారా ? జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు వ్యవస్థ నిర్ణయాల విషయంలో జోక్యం చేసుకోవద్దని. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వాళ్ళు లేరు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హామీలు అమలు చెయ్యని నువ్వు ఇప్పుడు హామీలు ఇస్తున్నావాని ప్రశ్నించారు.
చంద్రబాబు, ఉమామహేశ్వరావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి నాని, మా ముందు మీసాలు తిప్పి,చిటికలు వేస్తే కట్ చేస్తాం. నేను భూతులు తిడితే చంద్రబాబు,ఉమా బ్రతకాగలరా అని అడిగారు. సోడాలు కడిగిన నువ్వు మాపై విమర్శలు చేస్తున్నావ్. ఉమా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నాకు రాజకీయ భిక్ష పెట్టింది హరి కృష్ణ, ఎన్టీఆర్. పదవుల కోసం,సీట్ల కోసం ఎన్టీఆర్ ను అడుక్కున్న వ్యక్తి చంద్రబాబు. డైరెక్ట్ గా మాట్లాడుకుందాం అంటే మేమంతా వస్తానని అయన అన్నారు