హైద్రాబాద్, సెప్టెంబర్ 4
దేవికారాణిని మొదటిసారి అరెస్ట్ చేసినప్పుడు ఏసీబీ ఆమెకు సంబంధించిన రూ.35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి సీజ్ చేసింది. అయితే బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.200 కోట్ల వరకూ ఉందంటున్న ఏసీబీ అంచనా వేస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో ప్రధాన నిందితురాలుగా ఉన్న సంస్థ మాజీ డైరెక్టర్ దేవికారాణిని మరోసారి అరెస్టు చేశారు. ఈమెతో పాటు మరో 8 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తాజాగా ఈ కుంభకోణంలో ఏసీబీ అధికారులు 6.5 కోట్ల అవినీతిని గుర్తించిన సంగతి తెలిసిందే.దేవికారాణిని మొదటిసారి అరెస్ట్ చేసినప్పుడు ఏసీబీ ఆమెకు సంబంధించిన రూ.35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి సీజ్ చేసింది. అయితే బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.200 కోట్ల వరకూ ఉందంటున్న ఏసీబీ అంచనా వేస్తోంది. దేవికారాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ఏసీబీ నమోదు చేసింది. ఓవైపు విచారణ కొనసాగుతుండగానే నిందితులు తమ ఆస్తులు, బంగారు ఆభరణాలను పక్కా ప్రణాళిక ప్రకారం దారి మళ్లించినట్లు ఏసీబీ భావిస్తోంది.దేవిక రాణితో పాటు పద్మ, వసంత, ఇందిర, కంచర్ల శ్రీ హరి బాబు, అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృపా సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్‌లను ఏసీబీ అరెస్ట్ చేసింది.