YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అచ్చెన్న‌కు క‌లిసొస్తున్న కాలం

అచ్చెన్న‌కు క‌లిసొస్తున్న కాలం

విశాఖ‌ప‌ట్ట‌ణం, సెప్టెంబ‌ర్  5 
ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన కింజరాపు అచ్చెన్నాయుడుకు మంచి రోజులు వచ్చినట్లున్నాయి. ఈఎస్ఐ స్కాం లో ఇరుక్కోవడం కాదు కానీ రిమాండ్ ఖైదీగా 76 రోజుల పాటు అవస్థలు పడడం కాదు కానీ అధినేత చంద్రబాబు మంచి బహుమానమే ఇస్తున్నారు. అచ్చెన్నను ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా చేయాలని బాబు డిసైడ్ అయిపోయారు. దీనివల్ల కష్టకాలంలో తనకు అండగా నిలిచిన నాయకులకు మేలు చేస్తానని క్యాడర్ కి మెసేజ్ పంపడం ఒకటి అయితే అచ్చెన్న వల్ల బలహీనమైన బడుగు వర్గాల్లో పరపతిని తిరిగి సంపాదించుకోవడం, ఉత్తరాంధ్రాలో టీడీపీ జెండాను తిరిగి ఎగురవేయడం లాంటి లక్ష్యాలు అనేకం ఉన్నాయి.నిజానికి కింజారాపు కుటుంబం చంద్రబాబు మీద ఈ మధ్యంతా గుస్సా మీద ఉంది. ఒక దశలో అబ్బాయి ఎంపీ రామ్మోహననాయుడు అయితే బీజేపీలోకి వెళ్లిపోవడానికి చూశారు. ఇంకోవైపు ఆదిరెడ్డి భవానీని మామ వైసీపీలోకి నడిపిస్తారని కూడా ప్రచారం జరిగింది. ఇక అచ్చెన్న కూడా బెయిల్ మీద వచ్చిన తరువాత గతానికి భిన్నంగా ఉండాలనుకున్నారని చెప్పుకొచ్చారు. ఇలా బలమైన బీసీ కుటుంబం టీడీపీకి దూరం అయితే ఇక కష్టమేనని భావించిన చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యతను అచ్చెన్నకు ఇచ్చారనుకోవాలి.జగన్ కి అచ్చెన్న సరైన రాజకీయ ప్రత్యర్ధి అని బాబు భావిస్తున్నారు. అచ్చెన్నాయుడు అయితే బీసీ నేతగా దూకుడు చేసినా జగన్ గట్టిగా రెస్పాండ్ కాలేరని, ఒకవేళ రాజకీయ రాగింగ్ చేసినా బీసీ కార్డుతో తిప్పికొట్టవచ్చునని బాబు స్కెచ్ వేశారు. ఆ విధంగా బీసీ నేతలకు చేరువ కావడమే కాదు, వైసీపీకి కూడా దూరం చేయదం బాబు మార్క్ పాలిటిక్స్. ఇలా అన్ని రకాలుగానే ఆలోచన చేసి మరీ అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అంటున్నారు.అయితే దీని మీద కూడా సెటైర్లు పడుతున్నాయి. పట్టుమని పాతిక సీట్లు కూడా అసెంబ్లీలో లేని చిన్న పార్టీకి ముగ్గురు అధ్యక్షులు అవసరమా అన్న ప్రశ్న పార్టీ నుంచే వస్తోంది. తెలంగాణాకు ఒక ప్రెసిడెంట్, ఏపీకి మరో నేత, బాబు హోల్ అండ్ సోల్ మొత్తం నేతగా ఉన్నారు. కానీ టీడీపీ ఎక్కడ ఉంది అంటే కేవలం ఏపీలో కూడా కొన్ని జిల్లాలకే పరిమితం అయిందని తమ్ముళ్లు నిర్వేదం అవుతున్నారు. ఇక ఎవరు ప్రెసిడెంట్ అయినా ఒరిగేది ఏముందని అంతా బాబే కధ నడిపిస్తారని కూడా అంటున్నారు. అయితే అచ్చెన్నాయుడు అరెస్ట్ తరువాత బాబు పట్టించుకోలేదన్న నిందలకు టోటల్ గా అతి పెద్ద బిస్కట్ విసిరారని అంటున్నారు. మరి అచ్చెన్నాయుడు ఈ అధికారం లేని ఆరో వేలు లాంటి పార్టీ పదవితో హ్యాపీగా ఉంటారా లేక తనదైన వ్యూహాలకు పదును పెడతారా అన్నది చూడాలి.

Related Posts