విశాఖపట్టణం, సెప్టెంబర్ 5
చంద్రబాబు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ని పట్టించుకోవడంలేదని అంటున్నారు. రెండు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న గంటా అచ్చెన్నాయుడు కంటే కూడా ముందే మంత్రిగా పనిచేశారు. పైగా ఆర్ధికంగా, సామాజికంగా కూడా బలమైన వారు. కానీ చంద్రబాబు గంటా శ్రీనివాస్ ను కనీసం టీడీఎల్పీ ఉప నేతగా కూడా సెలెక్ట్ చేయలేదు. ఇక గంటా ఒక దశలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని ఆశించారని ప్రచారం జరిగింది. కానీ బాబు దాన్ని తీసుకెళ్ళి అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ కి ఇచ్చేశారు. ఇపుడు గంటా శ్రీనివాస్ టీడీపీలో ఉంటే ఏపీ ప్రెసిడెంట్ అయినా ఇస్తారని చివరి ఆశలు పెట్టుకున్నారు. కానీ కనీసం ఏ దశలోనూ గంటా పేరునే బాబు పస్తావించలేదని అంటున్నారు.బాబు లాంటి రాజకీయమే గంటా శ్రీనివాస్ కూడా చేస్తారని పేరు. పైగా ఢిల్లీ లెవెల్లో పెద్ద లాబీయింగే గంటాకు ఉంది. బాబు ఎక్కడ ఎవరిని కలుస్తున్నారు. ఆయన ఏ విధంగా కధ నడుపుతారూ అన్నీ గంటా శ్రీనివాస్ కు తెలిసిన విషయాలేనట. ఇక గంటాకు మెగా ఫ్యామిలీతో మంచి రిలేషన్స్ ఉన్నాయన్న సంగతి కూడా బాబుకు తెలుసట. ఇలా ఇద్దరూ ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకున్నారు కనుకనే నమ్మకాలు కూడా ఒకరి మీద మరొకరికి పెద్దగా లేవని అంటున్నారు. టీడీపీలో గంటా శ్రీనివాస్ ను కొనసాగించాలి అంటే ఆయనకు పార్టీలో ఏదైనా కీలకమైన పదవి ఇవ్వాలని బాబు ఎందుకు అనుకోవడం లేదని గంటా శిబిరంలో ఆవేదన వ్యక్తం అవుతోందిపుడు .గంటా శ్రీనివాస్ బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన వారు. ఆయనకు ఏపీలో మరో బలమైన కమ్మ సామాజికవర్గంతో కూడా సన్నిహిత సంబంధాలు, బంధుత్వాలూ ఉన్నాయి. ఆయన్ని కనుక ఏపీ ప్రెసిడెంట్ చేస్తే చాలా దూరమే వేళ్తారని బాబు భయమట. అందుకే గంటా శ్రీనివాస్ ను అధికారంలోకి రావడానికి మాత్రం ఉపయోగించుకుని ఒక మంత్రి పదవి వరకూ పరిమితం చేస్తున్నారని ఆయన వర్గం కుతకుతలాడుతోంది. గంటా కనుక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయితే ఉత్తరాంధ్రాతో పాటుగా ఏపీవ్యాప్తంగా కూడా టీడీపీని స్ట్రాంగ్ చేయగలరని కూడా అంటున్నారు. కానీ అపుడు బాబు ఎక్కడా కనిపించడని అందుకే ఆయనను ఒట్టి ఎమ్మెల్యేగా ఉంచేశారని అంటున్నారు.గంటా శ్రీనివాస్ గోడ దూకుళ్ల కధలు కూడా బాబుకు ఎరుకేనట. ఆయనను వైసీపీలోకి తీసుకోరని, ఏమీ బలం లేని ఏపీ బీజేపీలోకి గంటా జంప్ చేసేంత అమాయకుడు కాదని బాబు రాజకీయ విశ్లేషణ. అందువల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన టీడీపీలోనే ఉంటారని కూడా గట్టి నమ్మకమట. ఒకవేళ ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా టీడీపీ మళ్ళీ గెలుస్తుంది అనుకుంటే ఇటువైపే వస్తారు కాబట్టి ఆయన గురించి బాబు పట్టించుకోవడంలేదని చెప్పుకుంటున్నారు. అంతే కాదు, గంటా శ్రీనివాస్ ను పక్కన పెట్టేసి తనకు నిఖార్సు అయిన ఎమ్మెల్యేలకే బాబు పార్టీ పదవులు అప్పగించాలనుకుంటున్నారుట.