YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రి పై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు

అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రి పై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు

విజయవాడ సెప్టెంబర్ 5, 
అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రి పై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది  రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 17 వ తేదీన తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి,  18 న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి, 19న శ్రీ గాయత్రీ దేవి, 20 న శ్రీ అన్నపూర్ణాదేవి, 21 మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా  దుర్గమ్మల దర్శనమివ్వనున్నారు.
 22 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, 23 న శ్రీ మహాలక్ష్మీ దేవి, 24న శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషా సుర మర్ధనీ దేవిగా రెండు అలంకారాలలో దర్శనమిప్తారు.
25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం,  అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం జరరనుంది. కోవిడ్ దృష్ట్యా టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరా లో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం వుంది. రోజుకు 9 వేలా లేక సంఖ్య పెంచాలా అన్న దానిపై అధికారులు ఇంకా నిర్ణయానికి రాలేదు. గత ఏడాది దసరాలో రోజుకు లక్షపైనే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ ఏడాది కోవిడ్ దృష్ట్యా ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నారు.

Related Posts