YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు

తాడేపల్లి సెప్టెంబర్ 5, 
నగదు బదిలీ కాదు రైతు మెడకు ఉరితాడు అని పేరు పెట్టండని మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని మొదట ఆలోచన చేసిందే ఎన్టీఆర్. ఉచిత విద్యుత్ పేరుతో వైసీపీ ప్రభుత్వం నాటకాలు వేస్తోంది. మీటర్లు పెట్టాలన్న నిర్ణయంతో మెట్ట ప్రాంతాలు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోతారని అయన అన్నారు. ఇది రైతులకు సంబంధించిన అంశం ప్రభుత్వం దాయాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాదు. మీటర్లు పెట్టడం అంటే రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అప్పుల కోసం 18 లక్షల మంది రైతుల్ని మోసం చేస్తారా. ఎన్నికల ముందు ఏం చెప్పారు..జగన్ ఇప్పడు ఏమి చేస్తూన్నారు. జగన్ పబ్బం గడవుకోవలని అనుకుంటున్నాడు.  గంటకు రూ.9 కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారు. జగన్ చేతగాని తనం బయటపడుతుందని అయన అన్నారు.  ఏపీకి పెట్టుబడులు రావటంలేదు. చేతగాని విధానాలతో రాష్ట్ర పరువు, ప్రతిష్ట పోయాయి. నాలుగు నెలల్లో 80 శాతంపైగా అప్పులు చేశారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నంబర్ వన్..ఇప్పడు జగన్ హయాంలో ఎటు పోతుందో తెలియడం లేదు. విద్యుత్ రంగంలో సంస్కరణలకు నాంది పలికిందే టీడీపీ. విద్యుత్ పై మాట్లాడే హక్కు టీడీపీకి ఉంది. వైసీపీ సర్కార్ నయవంచన రోజుకొకటి బయటపడుతుంది. మీటర్లు పెట్టాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉచిత విద్యుత్ రైతులు పోరాడి సాధించుకున్న హక్కు. రైతులకు టీడీపీ హయాంలో నిరంతరం సరఫరా చేసాం....రైతుల వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదని అయన అన్నారు.  రాష్ట్రంలో ఎటుచూసినా అరాచకాలు,అసమర్థత కనిపోయిస్తున్నాయ్. అప్పులు చేసిప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తున్నారు. వ్యవసాయంపై మెదటి సారి బడ్జెట్ తీసుకొచ్చిన రాష్టం ఏపీ. టీడీపీ రైతుల పక్షాన ఉంటుంది...మోసాలు చేసే పార్టీకి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఎస్సి, ఎస్టీలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిన ఏకైక పార్టీ టీడీపీ. వైసీపీ సర్కార్ రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచింది. కోర్టులు చివాట్లు పెట్టినా జగన్ తీరు మారడంలేదు. వేలకోట్లు లాయర్ల కోసం ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అయన విమర్శించారు.

Related Posts