ఒక్క ఇంచూ వదలం..: భారత్ కుచైనా వార్నింగ్
న్యూ ఢిల్లీ
భారత్, చైనా మధ్య ఈస్ట్రన్ లడాఖ్‌లో గత కొన్ని నెలల నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మాస్కోలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణమంత్రి వీ ఫెన్‌గీ సమావేవం అయ్యారు. కానీ ఇవాళ ఉదయం చైనా సరిహద్దు సమస్యపై ఓ ప్రకటన చేసింది. లడాఖ్‌లో ప్రస్తుత పరిస్థితిక పూర్తి బాధ్యత భారత్‌దే అని ఆరోపించింది. తన లేఖలో భారత్‌ను అటాక్ చేసిన చైనా.. తమ భూభాగానికి చెందిన ఒక్క ఇంచును కూడా వదులుకోబోమఉని పేర్కొన్నది. తమ దళాలు దృఢంగా ఉన్నాయకని, సమర్థవంతమైన బలగాలు ఉన్నాయని, తమ భూభాగాన్ని, సార్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు తాము విశ్వాసంతో ఉన్నట్లు చైనా తన లేఖలో వార్నింగ్ ఇచ్చింది. భారత్, చైనా బోర్డర్ సమస్యకు కారణమైన నిజాలు, వాస్తవాలు అన్నీ ముందున్నాయని, బాధ్యత మొత్తం భారత్‌పైనే ఉన్నదని, ఒక్క ఇంచు కూడా వదులుకోబోమని, తమ సైనిక దళాలు కూడా సంసిద్ధంగా ఉన్నట్లు చైనా తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈస్ట్రన్ లడాఖ్‌లో అక్రమంగా చైనా తమ భూభాగాన్ని ఆక్రమిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్ 15వ తేదీన జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఇటీవల పాన్‌గాంగ్ సరస్సు వద్ద చైనా తన దళాలను మోహరించింది. దీంతో మళ్లీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్నది. శుక్రవారం చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ భేటీ అయినా.. డ్రాగన్ వైఖరిలో మార్పు లేనట్లు కనిపిస్తున్నది.
=====