పేరంటంలో శనగలే ఎందుకు!
భారతీయ సాంప్రదాయంలో పేరంటంలో మరియు పిల్లవాన్ని మొదటిసారి ఉయ్యాలలో వేసేటప్పుడు 4 మూలాలు శనగలు పోస్తారు.కొన్ని ప్రాంతాల్లో వివాహానికి ముందు శనగలు నానబెట్టి పెళ్లి పనులు చేసే ఆచారం కూడా ఉన్నది.పూర్వం పిల్లవాడికి విద్యాభ్యాసం చేసి పాఠశాలలో చేర్చేటప్పుడు అక్కడ ఉన్న పిల్లలకు ఉప్పు శనగలు పంచిపెట్టే వారు.కారణం శనగలు తింటే చలవ చేస్తుంది.ఆరోగ్యానికి మంచిది కాబట్టి.అలాగే ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే శనగలు గురువు గ్రహం యొక్క ధాన్యం గురువు యొక్క కిరణాలు పసుపు మీద శనగలు మీద అధికంగా ప్రసారం అవుతుంది.మన గృహం లో శుభకార్యాలు జరగాలన్న గురువు
యొక్క అనుగ్రహం అధికంగా ఉండాలి.అందుకే శుభకార్యాలు జరిగే చోట మరియు శుభకార్యాలు జరిగేటప్పుడు గురువు యొక్క దృష్టి అధికంగా ఉండే పసుపు, శనగలు వాడటం జరుగుతుంది...