అచ్చెన్నకు కమలం గాలం..
శ్రీకాకుళం,
ఉత్తరాంధ్రలో టీడీపీ కంచుకోట పగిలింది. ఇపుడు అక్కడ వైసీపీ హవా సాగుతోంది. కేవలం అరడజన్ సీట్లలొనే టీడీపీ గెలిచిన సంగతి విదితమే. ఇక ఉన్న ఎమ్మెల్యేలు, మాజీలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. అదే సమయంలో ఏపీలో కొత్తగా ప్రెసిడెంట్ అయిన బీజేపీ సోము వీర్రాజు కూడా ఆపరేషన్ ఉత్తరాంధ్ర అంటున్నారుట. ఆయన ఏకంగా గంటా శ్రీనివాసరావు నుంచి మాజీ మంత్రుల తలుపులు తట్టే పనిలో తెగ బిజీగా ఉన్నారు. వైసీపీలో చేరడానికి ఇష్టపడని నేతల లిస్ట్ పట్టుకుని మరీ తమ వైపు లాక్కోవాలని చూస్తున్నారు. అలా మూడు జిల్లాల్లో చాలా మంది ఉన్నారుట. అందులో అచ్చెన్నాయుడు పేరు ఇపుడు గట్టిగా వినిపిస్తోంది.అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఇపుడు నెగిటివ్ వచ్చింది. మరి రాజకీయాలో బీజేపీ మీద నెగిటివిటీ పోయి పాజిటివ్ నెస్ వస్తుందా అని ఆ పార్టీ నేతలు ఆశగా చూస్తున్నారుట. అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడం నుంచి దాదాపు మూడు నెలల పాటు ఇంటి ముఖం చూడకుండా రిమాండ్ ఖైదీగా ఉండడాన్ని కింజరాపు కుటుంబంతో పాటు అనుచరులు అసలు తట్టుకోలేకపొతున్నారుట. నిజానికి అబ్బాయి రామ్మోహన్నాయుడు అయితే ఒక దశలో జెండా ఎత్తేద్దామనుకున్నారని టాక్. అలాగే అమ్మాయి ఆదిరెడ్డి భవానీ కూడా జై బీజేపీ అనేస్తుందని వినికిడి. వీరంతా బాబాయి డెసిషన్ కోసమే చూస్తున్నారుట.ఇక అచ్చెన్నాయుడు టీడీపీ మీద రగులుతున్నాడని వస్తున్న టాక్ ని క్రాస్ చెక్ చేసుకోవడానికి టీడీపీ అధినాయకత్వం నానా తంటాలు పడుతోంది. ఏకంగా అచ్చెన్నాయుడు ఉన్న ఆసుపత్రికే చినబాబు లోకేష్ ఫోన్ చేసి మరీ ఆరోగ్యం గురించి వాకబు చేస్తూనే తాజా రాజకీయ పరిణామాల మీద కూడా చర్చించినట్లుగా చెబుతున్నారు. మీకు మేమున్నాం, అంతా కలసి పనిచేద్దామని చినబాబు అచ్చెన్నతో అన్నట్లుగా ఒక సెక్షన్ మీడియాలో న్యూస్ వచ్చింది. దానికి అచ్చెన్నాయుడు కూడా వైసీపీని కుమ్మేద్దాం అంటూ పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లుగా కూడా చెప్పుకున్నారు. ఇదంతా ఎందుకంటే అచ్చెన్న బోల్డ్ డెసిషన్ తీసుకుంటారని చంద్రబాబు సహా అంతా కలవరపడుతున్నారు కాబట్టి.అచ్చెన్నాయుడు బీజేపీలో చేరుతారా అన్నది పక్కన పెడితే ఆయన మాత్రం టీడీపీ మీద గుర్రు మీద ఉన్నారని ప్రచారం అవుతోంది. తాను ఇదివరకు అచ్చెన్నను కానని హై కమాండ్ కి తెలియచేస్తారని అంటున్నారు. ఇక బీజేపీలో చేరడానికి అచ్చెన్నాయుడుకు అభ్యంతరాలు ఏవీ లేవని కూడా చెబుతున్నారు. ఇపుడు వైసీపీ వేధింపులు ఎక్కువ అయ్యాయి. టీడీపీ చతికిలపడిపోయింది. చంద్రబాబు నుంచి మాటలు తప్ప చేతలు లేవు. ఇక ఏపీలో టీడీపీ సీన్ కూడా కాలినట్లుగానే ఉంది. దాంతో అన్నీ బేరీజు వేసుకుంటే అచ్చెన్నాయుడుకు బీజేపీ సేఫ్ జోన్ అని కింజరాపు కుటుంబ మిత్రులు కూడా అంటున్నారు. అలాగే మోడీ దగ్గర అబ్బాయి రామ్మోహననాయుడుకు మంచి గుర్తింపు ఉంది. ఈ నేపధ్యంలో ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఖరారు చేయించుకుని కాషాయం కండువా కప్పేసుకుంటే మంచిదేనని కూడా ఆయన వర్గంలో వినిపిస్తోందిట. ఇక విశాఖకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఎటూ కింజరాపు వియ్యంకుడే. ఇలా బలమైన సామాజికవర్గం పెద్ద నేతలంతా టీడీపీకి గుడ్ బై కొడితే అది చంద్రబాబు పార్టీకి రీసౌండ్ గానే ఉంటుంది మరి.