YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎరువుల‌పై  రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు డీలర్ల మధ్య  వివాదం

ఎరువుల‌పై  రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు డీలర్ల మధ్య  వివాదం

ఎరువుల‌పై  రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు డీలర్ల మధ్య  వివాదం
క‌ర్నూలు 
యూరియా గరిష్ట చిల్లర ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు డీలర్ల మధ్య వివాదం నెలకొంది. ఉత్పత్తి కేంద్రాల నుంచి యూరియాను డీలర్‌ పాయింట్‌ వద్దకు చేర్చేందుకయ్యే రవాణా ఖర్చులను ఎరువుల కంపెనీలు భరించాల్సి ఉండగా డీలర్ల నెత్తినేస్తున్నాయి. దాంతో డీలర్లు బస్తాకు నిర్ణయించిన ఎంఆర్‌పి కంటే రూ.30-40 అదనంగా రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇదిలాఉండగానే, యూరియా కావాలంటే తమ ఇతర ఉత్పత్తులను తప్పనిసరిగా కొనాలంటూ ఎరువుల కంపెనీలు డీలర్లకు షరతు పెడుతున్నాయి. వ్యాపారం కోసం కంపెనీల ఒత్తిళ్లకు తలగ్గిన డీలర్లు, యూరియా కోసం వెళ్లిన రైతులకు అవసరం లేని ఎరువులను, ఎంతమాత్రం పరిచయంలేని బయో ఉత్పత్తులను అంటగడుతున్నారు. కరోనా ఆర్థిక సంక్షోభ సమయాన అటు ఎంఆర్‌పి కంటే ఎక్కువ ధర ఇటు అవసరం లేని ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులు నష్టపోతున్నారు. కాగా కంపెనీల దోపిడీని అరికట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెపాన్ని ఒకరిపై మరొకరు నెట్టుకొని అంతిమంగా రైతులకు అన్యాయం చేస్తున్నాయి.ఎరువుల వ్యవహారం కేంద్రం పరిధిలోకొస్తుంది. కంపెనీలకు కేంద్రమే సబ్సిడీలు చెల్లిస్తుంది. అలాంటప్పుడు ప్రైవేటు డీలర్ల రవాణాకు అయ్యే ఖర్చులు సైతం కంపెనీలకు ఇచ్చే సబ్సిడీలతో ముడిపడే ఉంటాయి. కానీ కంపెనీలు రవాణా ఛార్జీలను పెట్టుకోకపోయినా కేంద్రం పట్టించుకోవట్లేదు. ప్రైవేటు కంపెనీలే కాదు కేంద్ర ప్రభుత్వరంగంలోని క్రిభ్‌కో వంటి సంస్థలు సైతం యూరియాను డీలర్‌ వద్దకు చేర్చేందుకయ్యే రవాణా ఛార్జీలను పెట్టుకోవట్లేదు. ఎన్‌ఎఫ్‌సిఎల్‌, క్రిభ్‌కో, సిఐఎల్‌, ఎన్‌ఎఫ్‌ఎల్‌, నర్మద, ఐపిఎల్‌, ఆర్‌సిఎఫ్‌ కంపెనీలు ట్రాన్స్‌పోర్టును పెట్టుకోవట్లేదు. ఎంఎఫ్‌ఎల్‌, ఎంసిఎఫ్‌, జవారీ, ఇఫ్‌కో కంపెనీలు ట్రాన్స్‌పోర్టు పెట్టుకుంటున్నాయి. రవాణాను పెట్టుకోని కంపెనీల వైఖరిపై కేంద్రం చోద్యం చూస్తోంది. పైగా కంపెనీలతో మాట్లాడాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని తప్పించుకుంటోంది.కేంద్ర బాధ్యతా రాహిత్యంపై నోరు మెదపని రాష్ట్రం, ఎంఆర్‌పి ఉల్లంఘనులపై కేసులు నమోదు చేస్తామని, లైసెన్స్‌లు రద్దు చేస్తామని చెబుతోంది. సమస్యను పరిష్కరించకుండా తమపై పడటమేంటని ప్రైవేటు డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. మార్క్‌ఫెడ్‌ నుంచి పిఎసిఎస్‌లు, డిసిఎంఎస్‌లకు లిఫ్టింగ్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి భరిస్తుండటంతో ఎరువుల కంపెనీలు ట్రాన్స్‌పోర్ట్‌ను పెట్టుకోకపోయినా అక్కడ ఎంఆర్‌పి అమలవుతోంది. ప్రైవేటు డీలర్ల దగ్గరకొచ్చేసరికి కంపెనీల నుంచి రవాణా ఛార్జీలను రాబట్టేందుకు ప్రయత్నించకుండా ఎంఆర్‌పి అమలు చేయాలనడంపై డీలర్ల సంఘాలు తప్పుబడుతున్నాయి. యూరియా కావాలంటే ఇతర ఉత్పత్తులు కొనాలనే కంపెనీల షరతుపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోణంలో ఆలోచించట్లేదంటున్నాయి

Related Posts