YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం దేశీయం

స్నూతిక్ కోసం భార‌త్ ప్ర‌య‌త్నాలు

స్నూతిక్ కోసం భార‌త్ ప్ర‌య‌త్నాలు

స్నూతిక్ కోసం భార‌త్ ప్ర‌య‌త్నాలు
న్యూఢిల్లీ, 
దేశంలో ప్రస్తుతం రోజుకు 85వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు అధిక సంఖ్యలో నమోదయిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండగా.. వ్యాక్సిన్ విషయమైన భారత ప్రభుత్వంతో రష్యా చర్చలు జరుపుతోందని ఆ దేశ రాయబారి నికోలే కుదాషేవ్ అన్నారు. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ సరఫరా, అభివృద్ధి, ఉత్పత్తి తదితర అంశాలలో సహకారంపై చర్చిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రపంచంలోనే కోవిడ్-19కు తొలి వ్యాక్సిన్‌ను రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాక్సిన్ భద్రత, సమర్ధతపై సందేహాలు వ్యక్తమవుతుండగా.. లాన్సెట్ పరిశోధన కొంత ఊరటనిచ్చింది. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో ఎటువంటి దుష్ప్రభావాలు చూపలేదని లాన్సెట్ తెలిపింది.ఇదిలా ఉండగా.. వ్యాక్సిన్‌కు సంబంధించిన ప్రాథమిక సమచారాన్ని భారత్‌కు రష్యా అందజేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ వివరాలను కేంద్రం పరిశీలిస్తోందని పేర్కొన్నాయి. నాకు తెలిసినంత వరకు, కొన్ని అవసరమైన సాంకేతిక దశల తరువాత, విదేశాలతో సహా విస్తృతంగా ఉపయోగించడానికి వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుంది అని కుదాషేవ్ అన్నారు.ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాస్కోలో పర్యటించనప్పుడు కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. మహమ్మారి తీవ్రత కొనసాగుతున్న వేళ కలిసికట్టుగా పోరాడాల్సి ఉన్నా కొన్ని దేశాలు రాజకీయాలు చేస్తున్నాయని, ఇటువంటి సమయంలో ప్రపంచం కోసం భారత్‌తో కలిసి పనిచేయాలని రష్యా భావించిందని అన్నారు.దురదృష్టవశాత్తు.. మహమ్మారి తీవ్రంగా ఉన్న కొన్ని దేశాలు భౌగోళిక రాజకీయ ఆటలు, ఏకపక్ష విధానాలతో ఆటంకాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి.. ఐరాస, ఓపీసీడబ్ల్యూ, డబ్ల్యూహెచ్ఓ సహా అంతర్జాతీయ సంస్థలను రాజకీయం చేస్తున్నాయి. అవిశ్వాసం, అస్థిరత, అనిశ్చితి ఇటువంటి విధానం స్పష్టంగా ముఖ్యమైన పరిష్కారాల నుంచి మనల్ని దూరం చేస్తోంది’ అని కుదాషేవ్ అన్నారు.ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడి.. ప్రజాస్వామ్యం, ప్రపంచ, ప్రాంతీయ సమస్యలకు సామూహిక పరిష్కారం, అంతరాలను నివారించడానికి భారత్ సహా ఇతర స్నేహపూర్వక దేశాలతో సహకారాన్ని మరింత విస్తరించాలని మేము ఆశిస్తున్నాం’ అన్నారు.

Related Posts