YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

 సీఎంకే దావుద్ అంటూ కాల్స్

 సీఎంకే దావుద్ అంటూ కాల్స్

 సీఎంకే దావుద్ అంటూ కాల్స్
ముంబై, 
అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ ఇబ్రహీం మనిషిని అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నివాసానికి ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేయడం కలకలం రేపింది. బాంద్రాలోని ఉద్ధవ్‌ వ్యక్తిగత నివాసమైన ‘మాతోశ్రీ’కి  రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రెండుసార్లు ఆ వ్యక్తి నుంచి కాల్ రావడంతో అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌చేసి ఆగంతకుడు.. తాను దావూద్ మనిషినని, దుబాయ్‌ నుంచి మాట్లాడుతున్నానని, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో దావూద్‌ ఇబ్రహీం మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పాడని పోలీసులు తెలిపారు.అయితే, ఆ కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి మాత్రం సీఎంకు ఫోన్‌ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ అంశంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, ఎటువంటి కేసూ నమోదు చేయలేదని అన్నారు. ఫోన్‌ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. నిజంగానే దుబాయ్‌ నుంచే ఆ ఫోన్‌ వచ్చిందా? లేదా ఇంకేదైనా ప్రాంతం నుంచి వచ్చిందా? అనేది తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యక్తిగత నివాసం మాతోశ్రీకి అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిన తర్వాత భద్రతను మరింత కట్టుదిట్టం చేశాం.. ఫోన్ చేసిన వ్యక్తి తాను దావూద్ మనిషినని, సీఎంతో ఆయన మాట్లాడాలనుకుంటున్నారని చెప్పాడు.. ఆ ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందో గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం’ అని ముంబయి పోలీసులు వివరించారు.తాజా, పరిణామాలతో ఉద్ధవ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి... ఆయన కుమారుడు యువసేన నేత ఆదిత్య ఠాక్రే, ఇతర కుటుంబసభ్యులకు భద్రతను పెంచారు. ఈ అంశాన్ని కేంద్రం సీరియస్‌గా పరిగణించాలని ఉద్ధవ్ క్యాబినెట్‌లోని మంత్రులు వ్యాఖ్యానించారు. ‘ఈ అంశంపై ఆదివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చించాం.. ఇది చాలా సీరియస్ అంశంమని క్యాబినెట్‌లోని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు.. ఫోన్ కాల్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు’ అని మహారాష్ట్ర సీఎంఓ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Related Posts