YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఇక పెర‌గ‌నున్న వాహానాల మైలేజ్

ఇక పెర‌గ‌నున్న వాహానాల మైలేజ్

ఇక పెర‌గ‌నున్న వాహానాల మైలేజ్
విజ‌య‌వాడ‌, 
టూ వీలర్ కావొచ్చు ఫోర్ వీలర్ కావొచ్చు వాహన కంపెనీ చెప్పిన మైలేజ్ ఎప్పుడు రాదు. ఇది వాహన చోదకుడు నడిపే విధానం వల్ల ఇలా తక్కువ వస్తుందేమో అని ఎవరికి వారు భావించడం రివాజు. కానీ మైలేజ్ తగ్గడానికి అసలు కథ మాత్రం వేరు. బండి మైలేజ్ పడిపోవడానికి ప్రధాన కారణం పెట్రోల్ బంక్ ల్లో జరుగుతున్న హైటెక్ మోసమని ఇప్పుడు తేటతెల్లం అయిపొయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఈ మోసం కోట్ల రూపాయలలోనే సాగుతుండటం అందరిని ఆందోళనకు గురిచేసింది.తెలంగాణ పోలీసులకు అందిన సమాచారంతో తూనికలు కొలతల విజిలెన్స్ విభాగాలతో పలు పెట్రోల్ బంక్ లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. పెట్రోల్ కొలతను సూచించే డిజిటల్ మీటర్లలో ఒక చిన్న చిప్ ను అమరుస్తారు. ఈ చిప్ కారణంగా వినియోగదారుడికి ఎలాంటి అనుమానం రాకుండా మీటర్ లో రీడింగ్ కనిపిస్తుంది. కానీ వాస్తవంగా 30 నుంచి 40 ఎం ఎల్ తక్కువ లీటర్ పెట్రోల్ కొడతారు. ఇలా ముంబాయి ముఠా ద్వారా సరఫరా చేయబడ్డ చిప్ లు ఎక్కడెక్కడి బంక్ లకు అమర్చారో టి పోలీసులు సజ్జనార్ ఆధ్వర్యంలో కూపీ లాగారు. అంతే తెలంగాణ తో పాటు ఎపి లో కూడా ఈ దందా నడుస్తున్నట్లు గుర్తించారు. ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇరు రాష్ట్రాల్లో పలు బంక్ లపై దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా బంక్ యజమానులను పట్టుకుని అరెస్ట్ చేశారు. తెలంగాణ లో 11 బంక్ లను ఎపి లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో నెల్లూరు, చిత్తూర్ జిల్లాల్లో 22 బంక్ లను సీజ్ చేసి 19 మందిని అరెస్ట్ చేశారు. పరారైన మరికొందరికోసం గాలింపు మొదలు పెట్టారు.
పెట్రోల్ బంక్ లపై ఎప్పటినుంచో వినియోగదారులు అనేక ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవాలిసిన యంత్రాంగం నిద్రావస్థలో జోగుతుంది. దీనికి ప్రధాన కారణం అవినీతే అన్నది పబ్లిక్ టాక్. తూనికలు కొలతలు, విజిలెన్స్ విభాగాల్లో పనిచేసే కొందరికి ముంబయి ముఠాలతో లింక్ లు ఉండటం లేదా పెట్రోల్ బంక్ యజమానులు క్రమం తప్పకుండా ఇచ్చే మామ్మూళ్లు ఈ అక్రమం యథేచ్ఛగా జరగడానికి కారణమని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయాలిసి ఉంది.ఇప్పటికే పెట్రోల్ డీజిల్ వినియోగదారులు జైళ్లశాఖ, లేదా పోలీస్ శాఖలు నిర్వహించే పెట్రోల్ బంక్ ల్లోనే అత్యధికంగా తమ వాహనాలకు ఇంధనం నింపుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కారణం మిగిలిన బంక ల్లో తాము మోసపోతున్నామనే భావన వినియోగదారులకు ఉంది. కళ్ళముందే జరిగే ఈ మోసం వినియోగదారులు పసిగట్టకుండా ఉండేందుకు బాటిల్స్ లో పెట్రోల్ పొసే సమయం లో మాత్రం సిబ్బంది ఈ డిజిటల్ మీటర్ ఆపే సౌకర్యం ఉండటమే కారణమని తెలిసి అంతా అవాక్కవుతున్నారు. తాజాగా ఈ మోసం బట్టబయలు కావడంతో మరో దొంగ దారి వెతికే వరకు తమ వాహనాల మైలేజ్ పెరుగుతుందని వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts