YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

క‌మ‌లం వ్యూహం అదేనా

క‌మ‌లం వ్యూహం అదేనా

క‌మ‌లం వ్యూహం అదేనా
విజ‌య‌వాడ‌, 
తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు వ్యూహాల్లో మాస్టర్. ఆయన ఎత్తులకు పై ఎత్తులు వేయాలంటే ఎవరైనా గింగిరాలు తిరగాల్సిందే. అయితే ఇదంతా గతం. చంద్రబాబు ఇపుడు ఓడిపోయి డిఫెన్స్ లో ఉన్నారు. ఆయన రాజకీయం కూడా తారుమారుగా ఉంది. దాంతో బాబుతో ఆడుకోవడానికి వైసీపీకి తోడు అన్నట్లుగా బీజేపీ నిలిచింది. ఏపీలో బేస్ లేకపోయినా ఢిల్లీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాషాయ దళం చంద్రబాబు మీద తెగ రెచ్చుతోంది, ఆయన్ని బాగా గిచ్చుతోంది. చంద్రబాబుని ఏమీ కాకుండా తీసిపారేస్తోంది. ముమ్మారు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు తమకు ఖాతరులేదన్నట్లుగా రాజకీయ గయ్యాళీతనాన్నే ప్రదర్శిస్తోంది.బాబుతో ఏపీ బీజేపీ నేతలు చెడుగుడు ఆడుకోవడం వెనక పక్కా వ్యూహం ఉందని అంటున్నారు. బాబుని కార్నర్ చేస్తూ సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వంటి వారు దాదాపుగా ప్రతీ రోజూ మాట్లాడుతున్నారు. ఏపీలో చంద్రబాబు సీఎం గా ఉన్నారా అన్నంతగా వారి మాటలు ఉంటున్నాయి. మీడియా సమావేశం పెట్టి సోము వీర్రాజు గత పాలన గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన అమరావతి రాజధానికి కేంద్రం ఇచ్చిన ఏడు వేల కోట్ల రూపాయ‌లు ఏమయ్యాయి బాబూ అంటూసోము గట్టిగానే గద్దించారు.బీజేపీ ఇలా ఎక్కడ పడితే అక్కడ కెలుకుతూ చంద్రబాబు సహనాన్ని పరీక్షిస్తోంది. చంద్రబాబు ఏ క్షణమైనా బరస్ట్ అయి రివర్స్ అటాక్ చేయాలన్నదే బీజేపీ ప్లాన్ అట. చంద్రబాబు ఆ వేడిలో ఏకంగా మోడీ మీదకు దండెత్తితే అదే ఆయనకు పెను శాపం అవుతుందన్నది బీజేపీ నేతల ఎత్తుగడట. మోడీని చంద్రబాబు ఏమైనా అంటే ఎప్పటికీ బాబుతో ఇక పొత్తు ఉండదని, ఆ విధంగా తమ పెద్ద నేతల మీద చంద్రబాబు నోరు పారేసుకుంటే దాన్ని సాకుగా చూపించి ఆయన్ని పూర్తిగా దూరం పెట్టాలన్నది బీజేపీ నేతల నయా వ్యూహంగా ఉంది.
ఇక చంద్రబాబు వంటి నాయకుడిని కదిపి కుదపాలనుకుంటే కుదిరే పని కాదు అన్నది అందరికీ తెలిసిందే. అయితే వయో భారం కారణంగా బాబు ఈ మధ్య కొంత అసహనానికి గురి అవుతున్నారు. దాంతో చంద్రబాబు ఎపుడైనా నోరు జారితే అది తమ నెత్తిన పాలు పోసినట్లేనని బీజేపీ నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారుట. బీజేపీ నేతలు ఎన్ని మాటలు అంటున్నా మిన్నకుండడమే తన రాజకీయమని చంద్రబాబు ఎంత చెప్పుకున్నా అది శ్రుతి మించితే మాత్రం బాబుకు తపోభంగం కలగక మానదు అని కూడా అంచనా వేస్తున్నారు. అపుడు మళ్లీ బాబు మోడీనీ, బీజేపీ నేతలను తప్పకుండా టార్గెట్ చేస్తారు. అలా జరిగితే అదే చంద్రబాబుకు పూర్తిగా తలుపులు వేసి టాటా చెప్పేయడమే బీజేపీ మాస్టర్ ప్లాన్. మరి బాబు లొంగుతారా. బీజేపీ రెచ్చగొట్టుడుకు గట్టి రిటార్ట్ ఇస్తారా.. వేచి చూడాల్సిందే.

Related Posts