YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం దేశీయం

చందాకొశ్చ‌ర్ భ‌ర్త అరెస్ట్

చందాకొశ్చ‌ర్ భ‌ర్త అరెస్ట్

చందాకొశ్చ‌ర్ భ‌ర్త అరెస్ట్
ముంబై, 
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొశ్చర్‌ భర్త, వ్యాపారవేత్త దీపక్‌ కొశ్చర్ అరెస్ట్‌ అయ్యారు. ఐసీఐసీఐ - వీడియోకాన్‌ రుణాల మంజూరు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయణ్ని అరెస్టు చేశారు. ఈ అంశంలో నమోదైన మనీ లాండరింగ్‌ కేసులో దీపక్ కొశ్చర్‌ను ఈడీ  ప్రశ్నించింది. ఈ విచారణలో అధికారులకు కీలక ఆధారాలు లభ్యం కావడంతో ఆయణ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాల కేటాయింపు అంశంలో చందాకొశ్చర్ ప్రతిష్ట మసకబారిన విషయం తెలిసిందే. ఈ కేసు కారణంగా ఐసీఐసీఐ బ్యాంక్‌లో సీఈవో సహా కీలక పదవులను కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈడీ ఆమె ఇల్లు, ఆస్తులను అటాచ్‌ చేసింది. ముంబైలోని చందాకొశ్చర్ ఫ్లాట్‌, ఆమె భర్త దీపక్‌ కంపెనీకి చెందిన కొన్ని ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. వీటి విలువ రూ.78 కోట్లు అని అధికారులు వెల్లడించారు.ఈ కేసులో చందాకొశ్చర్‌ దంపతులతో పాటు వీడియోకాన్‌ గ్రూప్‌నకు చెందిన వేణుగోపాల్‌ దూత్‌పైనా మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. 2012లో వీడియోకాన్‌ గ్రూప్.. బ్యాంక్‌ నుంచి రూ.3,250 కోట్ల రుణాలు పొందిందని, దీని వల్ల కొశ్చర్‌ కుటుంబం లాభపడిందనేది ప్రధాన అభియోగం. 2019 జనవరిలో చందాకొశ్చర్, ఆమె భర్త దీపక్‌‌తో పాటు మరికొందరిపై మనీ లాండరింగ్‌ క్రిమినల్‌ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం చందాకొశ్చర్ దంపతులు ఇప్పటికే పలుమార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు.
===============

Related Posts