YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

క‌నిపించ‌కుండా పోయిన ప‌య్యావుల‌

క‌నిపించ‌కుండా పోయిన ప‌య్యావుల‌

క‌నిపించ‌కుండా పోయిన ప‌య్యావుల‌
అనంత‌పురం, 
ప్రత్యర్థి పార్టీలకు ధీటైన జవాబు ఇవ్వడంలో దిట్ట. రాజకీయాల్లో అనుభవం ఉంది. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే నేతల్లో ఆయన ఒకరు. మరి అలాంటి వ్యక్తి చాలా రోజులుగా సెలైంట్ అయ్యారు. ఉన్నట్టుండి ఆ నేత ఎందుకు కనిపించకుండా పోయారు.ఆయనకు టీడీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరుంది. విషయం ఏదైనా పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించడంలో.. ప్రత్యర్థి పార్టీలకు ధీటైన జవాబు ఇవ్వడంలో దిట్ట. రాజకీయాల్లో అనుభవం ఉంది. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే నేతల్లో ఆయన ఒకరు. మరి అలాంటి వ్యక్తి చాలా రోజులుగా సెలైంట్ అయ్యారు. ప్రెస్‌మీట్లలో కనిపించడం లేదు.. సోషల్ మీడియా ఊసే లేదు. ఉన్నట్టుండి ఆ నేత ఎందుకు కనిపించకుండా పోయారనే చర్చ జరుగుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఆయన మౌనం వెనుక భావం ఏంటనే చర్చ జరుగుతుంది.. ఆయన ఎవరో కాదు టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.పయ్యావుల చాలా రోజులుగా మీడియా ముందుకు రావడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలపైనా అంతగా స్పందించలేదు. పార్టీలో సీనియర్లుగా ఉన్న అచ్చెన్నాయుడు, జేసీ ఫ్యామిలీ, మాజీ మంత్రి కొల్లు రవీంద్రల అరెస్ట్‌ల అంశంపైనా ఆయన పెద్దగా మాట్లాడలేదు. ఇక జేసీ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తాడిపత్రి వచ్చిన సమయంలో కూడా పయ్యావుల ఆ పర్యటనకు దూరంగా ఉన్నారు. అప్పుడే పార్టీలో చర్చ జరిగింది. అధినేత కుమారుడు వచ్చినా ఎందుకు వెళ్లలేదని ప్రశ్న తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కూడా పయ్యావుల కేశవ్ ఎక్కడా కనిపంచలేదు.రాజకీయంగా యాక్టివ్‌గా ఉండే పయ్యావుల ఉన్నట్టుండి పెద్దగా కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఆయన మౌనం వెనుక వ్యూహం ఏదైనా ఉందా.. అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారా.. కరోనా సమయం కాబట్టి సైలెంట్ అయ్యారా.. అధికార పార్టీ దెబ్బకు మౌనమే మంచిదనుకున్నారా వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు అసెంబ్లీలో పీఏసీ ఛైర్మన్ పదవి అప్పగించినా కేశవ్ ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. దీనిపై ఆయన స్పందించాల్సి ఉంది.పయ్యావువ కేశవ్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఉరవకొండ నుంచి వరుసగా ఆరు సార్లు పోటీ చేసి, నాలుగుసార్లు విజయం సాధించారు. రెండుసార్లు ఓటమి తప్పలేదు. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.. తర్వాత 2004, 2009, 2019 ఇలా నాలుగు సార్లు విజయం సాధించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా కేశవ్ ఓడిపోయారు. తర్వాత చంద్రబాబు కీలకమైన నేత కావడంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. మంత్రి పదవి ఆశించినా దక్కలేదు. 2019 ఎన్నికల్లో రాయలసీమ నుంచి టీడీపీ గెలిచిన మూడు సీట్లలో పయ్యావుల ఒకరు.

Related Posts