ప్రముఖ టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత
విజయవాడ,
సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్రూమ్లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్లపై ప్రభుత్వం నిషేధించడంతో ఆయన గుంటూర్లో ఉంటున్నారు. సినిమాల్లోకి రాకముందు ఎస్ ఐ గా పనిచేశారు జయప్రకాష్ రెడ్డి. జయప్రకాశ్ రెడ్డి 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యారు. 1997లో విడుదలైన ప్రేమించుకుందాం రా చిత్రం ప్రతినాయకునిగా మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన ''సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు'' లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించి టాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యారు. సినీరంగానికి జయప్రకాశ్ రెడ్డి 30 ఏళ్ళుగా అనుబంధం ఉంది. అనేక విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించి టాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యారు. ఈఏడాది సంక్రాంతికి విడుదలయిన మహేష్ బాబు హిట్ మూవీ సరిలేరు నీకెవ్వరులో విలన్ ప్రకాష్ రాజ్ తండ్రిగా నటించారు.