తాజాగా దేశంలో 75,809 కొవిడ్ కేసులు నిర్ధారణ
న్యూఢిల్లీ
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచం వ్యాప్తంగా అత్యధికంగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన దేశాల్లో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా దేశంలో 75,809 కొవిడ్ కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. అలాగే వైరస్ ప్రభావంతో మరో 1,133 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 42,80,423కు చేరాయి. ప్రస్తుతం 8,83,697 యాక్టివ్ కేసులున్నాయని, 33,23,951 మంది బాధితులు కోలుకున్నారని, 72,775 మంది వైరస్ ప్రభావంతో మరణించారని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. సోమవారం ఒకే రోజు 10,98,621 టెస్టులు చేయగా.. 5,06,50,128 శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.