YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

యువతి ఆత్మహత్యాయత్నం

యువతి ఆత్మహత్యాయత్నం

యువతి ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం
విశాఖలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.మదురవాడ సమీపంలో వైయస్సార్ కాలనీలో ఇద్దరు యువతీ యువకులు ఆత్మహత్యకు పాల్పడటంతో ఒకరు మృతి చెందగా మరొకరుఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నారు.ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతో యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకొని మృతిచెందగా, వివరాలు సేకరిస్తున్న పోలీసుల సమక్షంలో భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు యత్నించింది. గాయాలపాలైన యువతిని ఆసుపత్రికి తరలించారు.
విశాఖ 5వ వార్డ్ మధురవాడ వైయస్సార్ కాలనీ 13 వా బ్లాక్ లో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నా డు. దీనిపై పోలీసులు విచారిస్తున్న సమయంలో వినీత అనే యువతి ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నం చేసింది. గాయాలపాలైన ఆమెను  చికిత్స నిమిత్తం కేజిహెచ్ కు తరలించారు.ఈ ప్రమాద సంఘటనలో మృతి చెందిన అరుణ్ కుమార్ ఐటిఐ విద్యా ను అభ్యసించాడు.పీఎం పాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts