క్రికెట్ అభిమానులుకు డిస్నీ+హాట్‌స్టార్ విఐపి
సెప్టెంబరు 19న డ్రీమ్ ఐపీఎల్ 2020లోని అన్ని లైవ్ స్పోర్టింగ్
హైదరాబద్
భారతదేశం అతి పెద్ద క్రీడా ప్రదర్శనకు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ ఎడిషన్ తన నూతన భరోసా మరియు దేశ వ్యాప్తంగా లక్షలాది మందిలో సరికొత్త ఉత్సాహాన్ని తోడ్కొని వస్తోంది. భౌతిక అంతరాన్ని పాటించే నియమాలతో, ప్రత్యక్షంగా క్రీడను వీక్షించేందుకు ఉన్న అడ్డంకుల నేపథ్యంలో, డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి ఇంటినే క్రీడా మైదానంలో ఉన్న అనుభవాన్ని తోడ్కొని వస్తుండగా, క్రీడాభిమానులు వర్చువల్ సముదాయాలతో చేరుకోవచ్చు. ఇది వారికి, వారి మిత్రులు అలానే క్రీడాభిమానులైన ఇతరులతో కలిసి పోటీలను రియల్-టైమ్‌లో సెల్ఫీలు మరియు వీడియోలను షేర్ చేసుకోవడంతో పాటు ఆటను ఆస్వాదించేందుకు అవకాశం కల్పిస్తుంది. పలు విభాగాల్లో మొట్టమొదటి ప్రసారాలను అందిస్తున్న వాటిలో భాగంగా డ్రీమ్ 11 ఐపీఎల్ 2020 నూతన మరియు ఇప్పటి డిస్నీ+హాట్‌స్టార్ మరియు డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.గత టోర్నమెంట్ల కన్నా మరింత నూతన శిఖరాలకు చేరుకోనున్న ఈ ఏడాది మ్యాచ్‌లను డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి కమ్యూనికేషన్లతో వాచ్’ఎన్ ప్లే సోషియల్ ఫీడ్‌ను కొత్తగా అందుబాటులోకి తీసుకుని రాగా, ఇది దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల సముదాయాన్ని ఒక్క చోటుకు తీసుకు వచ్చి, ఈ ప్లాట్‌ఫారంలో లైవ్ పోటీలను వీక్షిస్తున్న సమయంలో తమ ఉత్సాహం మరియు మద్దతును ఇతరులతో పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. స్టేడియంలోని ఉండి ఉత్సాహంతో అరిచే అరుపులను ప్రతిబింబించి అభిమానులు కమ్యూనికేషన్‌తో కూడిన ఎమోజీ స్ట్రీమ్‌లను ఉపయోగించి దేశపు మూడ్‌ను నిర్ణయించడంలో భాగస్వాములు అవుతారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్రికెట్ ప్రేమికులు తమను ‘హాట్‌షాట్స్’ సెల్ఫీలు లేదా నూతన వీడియో ఫీచర్ ‘డ్యుయెట్స్’ అభిమానులకు ప్రత్యేక వీడియోలను ఆకట్టుకునే షాట్లను మరియు వారికి ఇష్టమైన డ్రీమ్11 ఐపీఎల్ హీరోస్ ప్రతిస్పందనలను ప్రదర్శించేందుకు అవకాశం ఉండగా; వాటిలో అత్యుత్తమమైన వాటిని స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం చేస్తారు.ఈ సందర్బంగా స్టార్ & డిస్నీ ఇండియా ఛైర్మన్, ది వాల్ట్ డిస్నీ కంపెనీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ‘‘గత కొన్నేళ్ల నుంచి ఐపీఎల్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడా టోర్నమెంట్‌గా గుర్తింపు దక్కించుకుంది. పలు నెలల పాటు లాక్‌డౌన్ అనంతరం ఈ టోర్నమెంట్ భారతదేశంలో ఆశావాదాన్ని మరియు సంతోషాలను తీసుకు రావడంలో ఉత్ప్రేరకంగా పని చేయనుండగా, దేశంలోని అన్ని భాగాల నుంచి మొత్తం మీద కోట్లాది మంది అభిమానులు ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారని విశ్వసిస్తున్నాము. సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే అన్ని లైవ్ మ్యాచ్‌లు ప్రత్యేకంగా డిస్నీ+హాట్‌స్టార్ విఐపి (12 నెలలకు రూ.399/-) మరియు డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం (12 నెలలకు రూ.1499/-) నూతన మరియు ఇప్పటి చందాదారులకు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు తమ సబ్‌స్క్రిప్షన్‌ను నేరుగా క్రెడిట్/ డెబిట్ కార్డు, నెట్‌బ్యాంకిండగ్ లేదా యుపిఐ ఇలా తమ ప్రాధాన్యతల డిజిటల్ ఎంపికలతో నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. అదనంగా ప్రజలకు సబ్‌స్క్రిప్షన్‌ను మరింత సరళం చేసేందుకు డిస్నీ+హాట్‌స్టార్ విఐపిభారతదేశంలోని అగ్రగామి టెలికాం కంపెనీలైన జియో మరియు ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. సెప్టెంబరు 19న డ్రీమ్ ఐపీఎల్ 2020లోని అన్ని లైవ్ స్పోర్టింగ్ యాక్షన్‌ను డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి లో వీక్షించవచ్చు.