పత్తికొండ సెప్టెంబర్ 10,
నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో భారీగా తెలంగాణ మద్యంను పట్టుకొని పోలీసులు సీజ్ చేశారు.వివరాల్లోకి వెళ్ళగా పత్తికొండ పట్టణంలోని కుమ్మరి వీధిలో 140 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని,తుగ్గలి మండలానికి చెందిన వైసీపీ నాయకుడు శభాష్ పురం హనుమంతు ను అదుపులోకి తీసుకున్నట్లు టౌన్ సిఐ ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు.సీఐ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన తెలంగాణ నుండి అక్రమ మద్యం తీసుకు వచ్చి పత్తికొండలో విక్రయించినట్లు తమ దృష్టికి రావడంతో దాడులను నిర్వహించామని తెలియజేశారు.ఈ దాడిలో దాదాపు 114 క్వార్టర్లు,12 ఫుల్ బాటిల్స్ పైగా మద్యం సీసాలు దొరికాయని సిఐ వివరించారు.భవిష్యత్తులో ఎవరైనా తెలంగాణ కర్ణాటక ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని గాని,గుట్కాలు గాని అక్రమంగా అమ్మినట్లు అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎవరైనా అక్రమ మద్యం అమ్మినట్లు తెలిస్తే,తమ దృష్టికి తీసుకురావాలని సిఐ తెలియజేశారు.వారి పేర్లను ఫోన్ నెంబర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.అనంతరం పత్తికొండ ఎక్సైజ్ ఎస్ఐ రాజశేఖర్ మరియు ఎక్సైజ్ పోలీస్ అధికారులు తుగ్గలి మండలంలోని శభాష్ పురం గ్రామంలో సోదాలను నిర్వహించారు.సోదాలలో ఎలాంటి మద్యం దొరకలేదని వారు తెలియజేశారు. ఎవరైనా ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం తీసుకొనివచ్చి అమ్మినట్లు తెలిస్తే వారికి చట్టపరంగా కఠినంగా శిక్షలు విధిస్తామని ఎక్సైజ్ ఎస్ఐ రాజశేఖర్ హెచ్చరించారు.ప్రజలు కూడా అధికారులకు సహకరించి అక్రమ మద్యం అమ్ముతున్న వారి వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఎక్సైజ్ ఎస్.ఐ రాజశేఖర్ తెలియజేశారు.పట్టుబడిన అక్రమ మద్యం ను సీజ్ చేసి శభాష్ పురం హనుమంతు పై కేసు నమోదు చేసినట్లు పత్తికొండ సీఐ ఆదినారాయణ రెడ్డి తెలియజేశారు.