YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

అర్ధరాత్రి నిఖా కుదర

అర్ధరాత్రి నిఖా కుదర

 రాత్రి 12 దాటితే ఫంక్షన్‌హాళ్లకు తాళం
ముస్లిం ప్రముఖులు, ఖాజీలు, పోలీసు అధికారులు, 
 ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులతో రేపు వక్ఫ్‌బోర్డు చైర్మన్ ప్రత్యేక సమావేశం

ఫంక్షన్ హాళ్లలో అర్ధరాత్రి వరకు ముస్లింల వివాహాలు, విందులను నివారించడంతోపాటు వాటిని త్వరగా ముగించేలా చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సాహసోపేతమైన చర్యలకు సిద్ధమవుతున్నది. 
తగు కారణం లేకుండా ఆలస్యంగా జరిగే వివాహాల కార్యక్రమాన్ని ఖాజీలు బహిష్కరించే విధంగా బోర్డు కఠిన నిర్ణయం తీసుకోనున్నది. అర్ధరాత్రి 12 దాటగానే ఫంక్షన్‌హాళ్లకు తాళాలు వేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ఖాజీలు (వివాహాలు జరిపించే పండితులు), ఫంక్షన్‌హాళ్ల యాజమాన్యాలు, పోలీసు అధికారులు, ముస్లిం ప్రముఖులతో మంగళవారం వక్ఫ్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ముస్లిం సమాజంలో అర్ధరాత్రి వరకు జరిగే వివాహాది కార్యాలు, పెండ్లికొడుకు ఊరేగింపులు, విందులు అనర్ధాలకు దారితీస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. రాత్రి రెండుగంటల వరకు ఫంక్షన్‌హాళ్లలో కొనసాగుతున్న డిన్నర్లతో ముస్లిం సమాజంలో దుష్ప్రభావం చూపుతున్నది. ఇలాంటి పరిణామాలకు అడ్డుకట్ట వేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ముస్లిం ప్రముఖులు, ఖాజీలు, ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు, పోలీసు అధికారులతో ఈనెల 23న ప్రత్యేక సమావేశాన్ని వక్ఫ్‌బోర్డు ఏర్పాటుచేసింది. పెండ్లి పత్రికలో పొందుపర్చిన సమయం కంటే ఆలస్యం జరిగే నిఖాల కార్యక్రమానికి ఖాజీలు వెళ్లకూడదని, బహిష్కరించాలని వక్ఫ్‌బోర్డు కఠిన నిర్ణయం తీసుకోబోతున్నది.

Related Posts