YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఖర్చు లేక మురిగిపోతున్న నిధులు

ఖర్చు లేక మురిగిపోతున్న నిధులు

కడప జిల్లాల్లోని పలు మున్సిపాల్టీలతోపాటు స్థానిక సంస్థల్లో కూడా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు మంజూరు కాలేని పరిస్థితి వచ్చింది.  . గతనెల మార్చిలో రాష్టవ్య్రాప్తంగా సామాజిక తనిఖీలు నిర్వహిస్తూ కడప జిల్లాలో జిల్లా పరిషత్, మండల ప్రజాపరిషత్, మున్సిపాల్టీలు ఖర్చుచేసిన నిధులకు మంజూరుకు సంబంధించి నివేదికలు ఈ కమిటీ తనిఖీచేసింది. అయితే అనేక ప్రాంతాల్లో అధికారులు నిధులు మంజూరైనా ఏమాత్రం పనులు చేపట్టలేని పరిస్థితి చూపడం పట్ల తనిఖీలునిర్వహించిన అధికారులు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.మంజూరువుతున్న పథకాలు పనులుచేపట్టలేక నిర్వీర్యం అవుతున్నాయి. 2014-15 కింద ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.1.92కోట్లు నిధులు మంజూరు చేశారు. ఈ నిధులను 2015-16 నాటికి ఖర్చుపెట్టాల్సివుంది. కానీ ఈ రెండేళ్లలో కేవలం రూ.14.37లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన మొత్తాన్ని పొదుపుకింద జమచేశారు. అయితే ఈ నియోజకవర్గంలోని మూడువర్గాల నేతల మధ్య ఈ నిధులు ఖర్చు చేయడంలో మున్సిపల్‌శాఖ ముందంజవేయలేకపోయింది. గత ఏడాది మున్సిపాల్టీలో కొత్త పాలక వర్గాన్ని ఎన్నుకునే వ్యవహారంలో పార్టీలోని రెండువర్గాల మద్య జరిగిన ఆధిపత్యంతో ఈ నిధులతో ఎలాంటి పనులు చేపట్టలేదు. పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినా ఇవి తమకు దక్కవనే భావనతో ఎవరికివారు పరస్పరం ఫిర్యాదులు చేయడంతో ఈ నిధులు మురిగిపోయాయి. దీంతో 12వ ఆర్థిక ప్రణాళిక కింద కొత్తగానిధులు రాకపోగా ఉన్ననిధులు ప్రభుత్వ ఖజానాకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే పులివెందుల మున్సిపాల్టీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం సుమారు రూ.3.42కోట్లు నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో మున్సిపాల్టీలో కాంప్లెక్స్ పనులు 2017నాటికి పూర్తికావాల్సివుంది. కానీ ఎలాంటిపనులు చేపట్టలేదు. ఈ నిధులు కూడా వెనక్కువెళ్లే పరిస్థితి రాగా ఈ ఏడాది ఈ కాంప్లెక్స్ నిర్మిస్తే రూ.4.5కోట్లు ఖర్చు అవుతాయని తాజాగా నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఇదే గాకుండా ఈ మున్సిపాల్టీల్లో ఇంటింటికీ తాగునీటి మీటర్లు, రోడ్లు, కొళాయి కనెక్షన్లు వంటి వాటికి సుమారు రూ.కోటి 90లక్షలు మంజూరు చేశారు. ఈ నిధుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఇటీవల సామాజిక తనిఖీల్లో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. 11వ ఆర్థిక సంఘం మంజూరుచేసిన నిధులు ఖర్చు చేయలేకపోవడంతో 12వ ఆర్థిక సంఘానికి అదనపు నిధులకోసం ఈశాఖల నుండి ప్రతిపాదనలు వెళ్లినా ఈ నిధులు మంజూరు చేయలేని పరిస్థితి ఏర్పడింది మరోవైపు బద్వేలు నియోజకవర్గంలోపరిస్థితి ఇందుకు భిన్నంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నీరు-చెట్టు కింద, మున్సిపల్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరవుతున్నా, నియోజకవర్గంలోని వర్గ ఆధిపత్యపోరువల్ల ఏమాత్రం పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడటంతో సామాజిక తనిఖీల కమిటీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది

Related Posts