YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

లోన్ల పేరుతో మోసాలు

లోన్ల పేరుతో మోసాలు

నిజామాబాద్, సెప్టెంబ‌ర్ 10, 
ఆన్ లైన్ లో లోన్స్ ఇచ్చే కంపెనీలు ఈ మధ్య చాలా పుట్టుకొచ్చాయి. బ్యాంక్స్ తో పాటు ఫైనాన్స్ కంపెనీలు కూడా ఫిజికల్ అప్పియరెన్స్ లేకుండా ఆన్ లైన్లో రుణాలిస్తున్నాయి. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు ఫేక్ డాక్యుమెంట్స్ తో జనాలను బురిడి కొట్టిస్తున్నారు. ఇన్ స్టాంట్ గా లోన్ ఇప్పిస్తామని అందినకాడికి దోచుకుంటున్నారు. గత నెలరోజులుగా మూడు కమీషనరేట్ల పరిధిలో 12 కి పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి…కూకట్ పల్లికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇన్ స్టాంట్ లోన్ కోసం ఆన్ లైన్లో సెర్చ్ చేశాడు. రిలయన్స్ ఫైనాన్స్ గ్రూప్ కు చెందిన క్లబ్ డాట్ కామ్ వెబ్ సైట్ లో తన ఐడీ ప్రూఫ్, అడ్రస్ తో పాటు ఫోన్ నంబర్ తో అప్లై చేశాడు. తర్వాత రోజు క్లబ్ డాట్ కామ్ నుంచి శ్రీనివాసరావుకు ఫోన్ వచ్చింది. లోన్ అప్రూవల్ కావాలంటే ప్రాసెసింగ్ ఫీ, సెక్యూరిటీ ఫీ, అగ్రిమెంట్ ఫీ, ఇన్సూరెన్స్ ఫీ కింద లక్షా 3 వేల రూపాయలు కట్టాలని చెప్పారు. ఈ డబ్బు మళ్లీ లోన్ తో పాటు తిరిగి వస్తుందని చెప్పడంతో ఆ మొత్తాన్ని ఆన్ లైన్ లో చెల్లించాడు శ్రీనివాసరావు. ఐతే తిరిగి మరికొంత డబ్బు కట్టాలని కాల్స్ రావడంతో మోసపోయానని గ్రహించిన శ్రీనివాస రావు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో పాటు రీసెంట్ గా చిక్కడపల్లికి చెందిన సంగీతకు యాక్సిస్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామంటూ కాల్ వచ్చింది. తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ ఉందంటూ ఆఫర్ చేశారు. దీనికి సంగీత ఓకే చెప్పడంతో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఆమె అకౌంట్ లో డబ్బులు పడగానే…. ఓటీపీ చెప్పమని డబ్బులు కొట్టేశారు కేటుగాళ్లు.
ఇక దూల్ పేట్ కు చెందిన అభిషేక్ సింగ్ కు బజాజ్ ఫైనాన్స్ నుంచి పర్సనల్ లోన్ మంజూరు అయిందంటూ నమ్మించి మోసం చేశారు. తక్కువ వడ్డీకే బజాజ్ ఫైనాన్స్ నుంచి 5 లక్షల లోన్ ఇస్తామంటూ చాలాసార్లు ఫోన్ చేశారు. దీంతో తన డాక్యుమెంట్స్ వాళ్లకి పంపించాడు అభిషేక్. తర్వాత లోన్ మంజూరు అయ్యిందని… కానీ డబ్బులు రావాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలంటూ లక్షన్నర వసూలు చేశారు. ఐతే దీనిపై బాధితుడు ప్రశ్నించడంతో రిజిస్ట్రేషన్ ఫీ మినహా మిగతా డబ్బు వాపస్ వస్తుందని నమ్మించారు. తర్వాత ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసపోయానని గ్రహించిన అభిషేక్ సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఆన్ లైన్ లో ఇన్స్టాంట్ లోన్స్ ఇస్తామనే వాళ్లను నమ్మోద్దంటున్నారు సైబర్ పోలీసులు. లోన్ తీసుకునే వారు ముందుగా బ్యాంకుని సంప్రదిస్తే మంచిదని చెప్తున్నారు. వ్యక్తిగత వివరాలను ఇతరులకు షేర్ చేయోద్దంటున్నారు.

Related Posts