YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాహుల్ కు బాధ్య‌త‌లు త‌ప్ప‌ని స‌రి

రాహుల్ కు బాధ్య‌త‌లు త‌ప్ప‌ని స‌రి

న్యూఢిల్లీ, సెప్టెంబ‌ర్ 10, 
కాంగ్రెస్ అధిష్టానం ముందు విచిత్రమైన సమస్య తలెత్తింది. సీనియర్ నేతల లేఖతో ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఖచ్చితంగా బాధ్యతలను చేపట్టాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తింది. గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరొకరిని అధ్యక్షుడి చేయాలన్న ఆలోచన ఇప్పుడు టెన్ జన పథ్ నుంచి మాయమయినట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా తిరిగి రావాలని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నాయి.కానీ రాహుల్ గాంధీ మాత్రం ఇప్పుడప్పుడే అధ్యక్ష్య బాధ్యతలను చేపట్టేందుకు ఇష్టపడటం లేదు. పార్టీని ప్రక్షాళన చేయకుండా తాను బాధ్యతలను చేపట్టినా, చేపట్టక పోయినా ఒకటేనని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. సీనియర్ నేతల వలలో కాంగ్రెస్ చిక్కుకుపోయిందని రాహుల్ గాంధీ గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకోసమే పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసిన తర్వాతనే తాను అధ్యక్ష్య బాధ్యతలను చేపట్టాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.నిజం చెప్పాలంటే కాంగ్రెస్ బలం బలహీనత రెండూ గాంధీ కుటుంబమే. గతంలో గాంధీయేతర కుటుంబం నుంచి కొద్దిమంది బాధ్యతలను చేపట్టినా వారు రిమోట్ కంట్రోలో మాదిరిగానే వ్యవహరించారు. అంతెందుకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ప్రధాని మన్మోహన్ సింగ్ టెన్ జన్ పథ్ చెప్పినట్లే నడుచుకునే వారు. ఇక కొత్తగా గాంధీయేతర కుటుంబం నుంచి ఎవరు అధ్యక్షుడయినా ఇంతే. టెన్ జన్ పథ్ నుంచి ఆదేశాలు వచ్చే వరకూ ఆయన ఏ నిర్ణయమూ తీసుకోరు.అందుకే నేరుగా గాంధీ కుటుంబం నుంచే అధ్యక్షుడిగా ఉండాలన్న కోరిక అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ రాకతో యువనాయకత్వానికి ప్రోత్సాహం పెరుగుతుందని కూడా అనేక మంది ఆశిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో పార్టీని ఇప్పటికీ సీనియర్ నేతలే శాసిస్తుండటంతో యువనాయకత్వం ఎదగలేకపోతుంది. అందుకే సీనియర్ నేతలను కట్టడి చేయాలంటే తిరిగి రాహుల్ రావాలన్నది పార్టీలో ఎక్కువమంది అభిప్రాయం. టెన్ జన్ పథ్ కూడా అదే నిర్ణయానికి వచ్చిందని తెలిసింది. రాహుల్ బాధ్యతలను చేపట్టేలోగా పార్టీలో సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నా

Related Posts