YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అసెంబ్లీ వేదికగా కరోనాపై పోరులో కాంగ్రెస్ ఘన విజయం

అసెంబ్లీ వేదికగా కరోనాపై పోరులో కాంగ్రెస్ ఘన విజయం

హైదరాబాద్, సెప్టెంబర్ 10 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరిస్థితులు.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న పోరాటానికి అసెంబ్లీ సాక్షిగా కీలక విజయం లభించింది.  భట్టి విక్రమార్క చేసిన పలు సూచనలపై నిర్థిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు నిండు సభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సభ 3వ రోజు కరోనాపై చర్చలో భాగంగా.. కరోనా దుర్బర పరిస్థితులు, ప్రభుత్వాసుపత్రుల్లో నెలకొన్న సమస్యలు, సిబ్బంది కొరత,  ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ,  బడుగు, బలహీన వర్గాల ప్రజలు, అసంఘటిత కార్మికులు పడుతున్న ఇబ్బందులపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సమగ్రంగా మాట్లాడారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి నిర్మాణాత్మక మరియు నిర్ధిష్టమైన సూచనలు చేశారు.  తన పర్యటనలో భాగంగా ప్రభుత్వాసుపత్రుల్లో గుర్తించిన సమస్యలపై నివేదికను స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు.  ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపుతూనే ప్రజలకు ఏం కావాలో, ప్రభుత్వం ఏం చేయాలో తేల్చి చెప్పారు.దీంతో గత అసెంబ్లీలో బాధ్యత లేకుండా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఈ సారి సభలో.. భట్టి సూచనలను పూర్తిగా పరిగణన లోకి తీసుకోవాల్సి వచ్చింది.  ఇందులో ముఖ్యంగా కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందనే ప్రకటనను సీఎం చేత చేయించటంలో భట్టి విక్రమార్క సక్కెస్ అయ్యారు. కరోనా మహమ్మారి పంజా విసిరిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ అంశంపై సీరియస్‌గా పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటన చేయటంతో.. కాంగ్రెస్ పార్టీ చేసిన సహేతుక డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టయ్యింది. మరోవైపు కార్పొరేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధిక ఫీజుల దోపిడీ నియంత్రణకై.. ఓ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆది నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే... ఈ అంశాన్ని ఆయన అసెంబ్లీ వేదికగా మరోసారి ప్రస్తావించారు. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్.. తక్షణమే ఓ ఐఏఎస్ అధికారితో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించటమే కాకుండా.. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై ప్రతీ వారం విపక్షాలకు సమాచారం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన ఈ విలువైన సూచనలను తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటుందని సభ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా..  కరోనా వల్ల  ఉపాధి కోల్పోయి కష్టాల పాలైన.. అసంఘఠిత రంగ కార్మికులు, చిరు వ్యాపారులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ఆర్ధిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని భట్టి చేసిన సూచన కూడా చాలా విలువైనదని కేసీఆర్ చెప్పటం విశేషం. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిర్దిష్టమైన ప్రతిపాదనలు ఇస్తే.. ఆర్దిక శాఖ కార్యదర్శితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ సభలో ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరోనాపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క ఇచ్చిన విలువైన సలహాలను పట్టించుకోని సీఎం కేసీఆర్.. ఆ తరువాత తెలంగాణ సమాజంలో నవ్వుల పాలయ్యారు. కరోనా వ్యాప్తికి, మరణాలకు కారణమయ్యారు. అయితే.. ఈసారి మాత్రం పాత తప్పులను పునరావృతం చేయకుండా.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇచ్చిన సూచనలపై తక్షణం చర్యలు తీసుకుంటానని చెప్పటం.. వ్యక్తిగతంగా భట్టి విక్రమార్కకు, పార్టీ పరంగా కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Related Posts