YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సాయుధ పోరాటంలో వేగుచుక్క చాకలి ఐలమ్మ

సాయుధ పోరాటంలో వేగుచుక్క చాకలి ఐలమ్మ

ములుగు  సెప్టెంబర్ 10 
ములుగు జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ 35 వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి జోహార్లు అర్పించిన మణికంఠ రజక సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు  ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ  పేద కుటుంబంలో పుట్టి అతి సాధారణ మహిళ అయినా అసామాన్య పోరాటం చేసి దొరలను గడగడలాడించిన తెలంగాణ వీరాంగిణి, వెట్టి విముక్తి కోసం తిరగబడ్డ తెగువ ఐలమ్మది. సనాతన సాంప్రదాయాన్ని వొదిలి  స్వాభిమాన జీవితం, సొంత అస్తిత్వం కోసం అగ్ని ఖనిక లాగా మండిన ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. భర్తను, కొడుకులను జైల్లో పెట్టినా కూడా భయపడకుండా " తెలంగాణ రైతు బిడ్డ కోసం జరిపిన పోరాటపు తొలి దశకు ఆమె చిహ్నం". ఉమ్మడి రాష్ట్ర కమ్యూనిస్టు అగ్ర నాయకులతో మన్నలను పొందిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985 న అమరత్వం చెందింది. మహిళా లోకానికి, ఉద్యమాలకు స్ఫూర్తి అయిన ఐలమ్మ ధైర్యానికి ప్రతీక, సాయుధ పోరాటంలో వేగుచుక్క ఐలమ్మ అని ఆయన అన్నారు  ఈ కార్యక్రమంలో మణికంఠ రజక సంఘం జిల్లా అధ్యక్షులు నేరెళ్ళ శంకర్,మండల అధ్యక్షులు రవి  రాజు,చంద్రయ్య,రాకేష్,ఐలయ్య  మధు,లక్కీ,తదితరులు పాల్గొన్నారు

Related Posts