YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సెప్టెంబర్ 17 విమోచనా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

సెప్టెంబర్ 17 విమోచనా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

చొప్పదండి సెప్టెంబర్ 10 

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మల్యాలమండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దారు గారికి గురువారం వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజెపి  మండల  కన్వీనర్ బి వెంకట స్వామి యాదవ్ తెలంగాణ రాష్ట్రానికి నిజమైన స్వతంత్రం 1948 సెప్టెంబర్ 17వ తేదీన ఆనాటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పోలీస్ చర్య వల్ల హైదరాబాద్ సంస్థానాధీశుడు నిజాం పటేల్ గారికి లొంగిపోయి భారతదేశంలో విలీనం చేశారని అన్నారు. ఇక్కడి ప్రజలను ఎన్నో రకాలుగా అత్యాచారాలు మానభంగాలకు గురిచేసి స్తూ చిత్రహింసలకు గురిచేశారని అన్నారు. అలాంటి నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతం అంతయు ఉద్యమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి వేలాది మంది క్షతగాత్రులు అయినారని . స్వాతంత్ర్యానంతరం తెలంగాణ ప్రాంతంలో జాతీయ జెండాను ఎగుర వేయకుండా హింసించారని జాతీయ జెండా ఎగరవేసిన వందలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారని తెలియ చేసారు. నిజాం పాలనలో ప్రజలు తన ప్రాణాలను కొట్టరా పెట్టుకొని జీవించారని అలాంటి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రజలు స్వేచ్ఛ స్వతంత్ర లతో కూడినటువంటి తెలంగాణ ను 1948 సెప్టెంబర్ 17న సాధించుకున్నారని అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం తో ఇక్కడి ప్రజలకు పూర్తి స్వతంత్రం వచ్చినది తెలంగాణ పోరాటంలో అమరులైన టువంటి అమరవీరులను స్మరిస్తూ ప్రభుత్వాలు విమోచన  దినోత్సవం జరపడంలేదని అన్నారు. భారతీయ జనతాపార్టీ 22 సంవత్సరాలుగా తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తున్నామని అయినా నేటి తెలంగాణ రాష్ట్రంలో 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవం జరగడంలేదని కెసిఆర్ గారు ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవం జరపక పోవడం దురదృష్టకరమని పేర్కోన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కెసిఆర్ గారి ప్రభుత్వం మజ్లిస్ ల పై  ఉన్న ప్రేమ నయాకాశీం రజ్వీ వలె  కెసిఆర్ గారు ఇక్కడే అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిజాం ప్రభువు వారసత్వానికి కొమ్ముకాస్తున్న నియంత పాలనతో తెలంగాణలో పూర్తిగా నిజాం పాలనను తలపించేలా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని లేనిపక్షంలో భవిష్యత్తులో బిజెపి ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని  డిమాండ్ చేస్తుందని తెలియ చేసారు. తెలంగాణ దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ విమోచన పోరాటాన్ని పాఠశాలలో చేర్చి భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఇప్పటికైనా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా  అధికారికంగా జరపాలని జరిపించాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గారికీ వినతీ పత్రం  అందజేసినట్లు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల కన్వీనర్ బొబ్బిలి వెంకట స్వామి యాదవ్ రాచర్ల రమేష్ గాజుల మల్లేశం  సురేష్ ఉప సర్పంచ్   నూక పెళ్లి కొక్కెర మల్లేష్ యాదవ్   కిలిటి రమేష్ కటకం హర్షవర్ధన్ నక్క ఆనందం బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts