అంబానీ సోదరులకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. అనిల్ అంబానీకి చెందిన 'రిలయెన్స్ కమ్యూనికేషన్‌ను కొనుగోలు చేయాలన్న ముకేశ్ అంబానీకి చెందిన 'రిలయెన్స్ జియో' ప్రతిపాదనకు సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది. ఈ ఆస్తుల విక్రయానికి 'నేషనల్ కంపెనీలా ట్రిబ్యునల్' ఇచ్చిన ఆర్డర్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆర్‌కాం టవర్ సంస్థలో 4 శాతం వాటా ఉన్న హెచ్‌ఎస్‌బీసీ డైసీ ఇన్వెస్ట్‌మెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది. రిలయెన్స్ కమ్యూనికేషన్స్‌కు వైర్‌లెస్, టవర్, ఆప్టిక్ ఫైబర్‌కు సంబంధించిన ఆస్తులను దాదాపు రూ.24,000 కోట్లకు రిలయెన్స్ జియోకు అమ్మాలని గతేడాది డిసెంబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో టవర్,ఫైబర్ ఆస్తులే రూ.8000 కోట్ల వరకు ఉంటాయి.ఈ ఒప్పందంపై 'హెచ్‌ఎస్‌బిసి డైసీ ఇన్వెస్ట్‌మెంట్స్' సంస్థ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా అనిల్ అంబానికే తీర్పు అనుకూలంగా వచ్చింది. అయితే హెచ్‌ఎస్‌బీసీ డైసీ ఇన్వెస్ట్‌మెంట్స్ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రంయించగా... ఈ మేరకు అపెక్స్ కోర్టు ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.