YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కంగారు పుట్టిస్తున్న కంగ‌నా

కంగారు పుట్టిస్తున్న కంగ‌నా

ముంబై, సెప్టెంబ‌ర్ 11, 
మహారాష్ట్ర రాజకీయాల్లో సినీనటి కంగనా రనౌత్ కలకలం రేపారు. ఇది సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలను తలెత్తేలా చేశాయి. కంగనా రనౌత్ విషయంలో తప్పు చేశారంటూ సంకీర్ణంలోని పార్టీలే అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుతో ప్రారంభమయిన ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది.కంగనా రనౌత్ కు, శివసేనకు మధ్య గతకొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతుంది. ముంబయిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా కంగనా రనౌత్ అభివర్ణించడంతో ఈ వివాదం మొదలయింది. దీనికి శివసేన ఘాటుగానే సమాధానమిచ్చింది. ముంబయి వచ్చి చూడాలని సవాల్ విసిరింది. కంగనా రనౌత్ కేంద్ర ప్రభుత్వ సహాయంతో వై కేటగిరి భద్రతను తీసుకుని ముంబయిలో అడుగుపెట్టింది.కంగనా రనౌత్ వచ్చే సమయానికి ఆమె కార్యాలయాన్ని కూల్చి వేసేందుకు ముంబయి కార్పొరేషన్ ప్రయత్నించింది. దీనిపై కంగనా రనౌత్ ముంబయి హైకోర్టును ఆశ్రయించి స్టేను పొందారు. కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేతపై దేశ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు అనేక మంది కంగనా రనౌత్ కు అండగా నిలిచారు. మహారాష్ట్ర సర్కార్ వ్యవహరించిన తీరును తప్పుపట్టాయి.
దీంతో పాటు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ కూడా కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేతను తప్పుపట్టింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సయితం దీనిని తొందరపాటు చర్యగా అభివర్ణించారు. దీంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే దిగిరాక తప్పలేదు. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను ఈ సంఘటనపై వివరణ కోరారు. శరద్ పవార్ ను కలసి దీనిపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద కంగనా రనౌత్ పులిని సయితం కంగారు పెట్టిందనే చెప్పాలి.

Related Posts