YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

లక్ష కోట్లకు దగ్గరలో జీఎస్టీ వసూళ్లు

లక్ష కోట్లకు దగ్గరలో జీఎస్టీ వసూళ్లు

 మార్చి నెల రిటర్నులు ఏప్రిల్ 20కల్లా దాఖలైనప్పుడు, వస్తువులు, సేవల పన్ను  వసూళ్ళు రూ. 93,000 కోట్ల నుంచి రూ లక్ష కోట్ల వరకు తిరిగి చేరుకోగలవని భావిస్తున్నారు. గత ఐదు నెలల్లో ఇవి సగటున సుమారు రూ. 87,000 కోట్లుగా ఉన్నాయి. కొత్త పన్ను వ్యవస్థ 2017 జూలైలో అమలులోకి వచ్చినప్పటి నుంచి జి.ఎస్.టి వసూళ్ళు  బాగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. మూడు నెలలపాటు నెలకు రూ. 90,000 కోట్లకు మించి దండిగా కనిపించిన వసూళ్ళు తర్వాత రెండు నెలల్లో తగ్గాయి. చాలా వరకు నవంబరులో పూర్తయిన లావాదేవీలకు సంబంధించి, 2017 డిసెంబరులో వసూళ్ళు రూ. 84,000 కోట్లకు తగ్గి, మార్చిలో రూ. 89,300 కోట్లకు మెరుగుపడ్డాయి. జి.ఎస్.టి సిస్టంలు ఇప్పుడు స్థిరత్వం పొందాయి. పన్ను వ్యవస్థ పట్ల వ్యాపార సంస్థలకు మెరుగైన స్పష్టత వచ్చింది. ఆరంభ నెలల్లో అవాంతరాల తర్వాత ఆర్థిక వ్యవస్థ కూడా తిరిగి సర్దుకుంది. జి.ఎస్.టి రేట్లు 2017 అక్టోబరు, నవంబరు నెలల్లో ప్రధానమైన మార్పులకు లోనయ్యాయి. డీవెురిట్ రేటు 28 శాతం చొప్పున పన్ను విధించే వస్తువుల జాబితాను 50కి కుదించారు. 178 వస్తువులపై రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. వసూళ్ళలో సమతూకం లేకపోవడానికి ఇది కారణమైంది. వర్తించే పన్ను రేట్లు, ఇన్‌పుట్ పన్ను క్రెడిట్ యంత్రాంగం పట్ల స్పష్టత కూడా కొరవడింది. వీటికి తోడు, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ స్థాయి కూడా అంతంతమాత్రంగానే ఉందని పన్ను నిపుణులు వివరించారు. ఈ రకమైన గందరగోళం ఉన్నప్పటికీ, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో దాఖలైన రిటర్నులు జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో చెప్పుకోదగ్గ వసూళ్ళకు సంకేతమిచ్చాయి. కానీ, అక్టోబరు నెల లావాదేవీలకు సంబంధించి నవంబరులో దాఖలైన  రిటర్నులలో వసూళ్లలో రూ. 9,200 కోట్ల తగ్గుదల కనిపించింది. తర్వాత నెలలో, అవి మరో రూ. 2,200 కోట్లు తగ్గాయి. రేట్ల విషయంలో అస్థిరత ఉంది. జనం వారి పన్నులను సక్రమంగా చెల్లించడం లేదని కెపిఎంజిలో పరోక్ష పన్ను విభాగ అధిపతి, పార్ట్నర్ సచిన్ మెనాన్ అభిప్రాయపడ్డారు. రేట్లు స్థిరత్వం పొంది, వ్యాపార సంస్థలకు అవాగహన మెరుగుపడిన తర్వాత డిసెంబరు నుంచి వసూళ్ళు మెరుగుపడ్డాయని ఆయన అన్నారు. ఎగవేతపై విరుచుకుపడతారనే భయం, ఈ-వే బిల్లును అనివార్యంగా ప్రవేశపెట్టడం కూడా వసూళ్ళను మెరుగుపరచి ఉంటాయని ఆయన అన్నారు. 

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్లు ముఖ్యంగా మార్పునకు సంబంధించిన క్రెడిట్లు క్లైమ్  చేయడంలో త్వరపడడం వల్ల అక్టోబరు, నవంబరు నెలల పన్ను వసూళ్లు తగ్గాయని ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో పార్ట్నర్ బిపిన్ సప్రా అభిప్రాయపడ్డారు. పన్ను భారాలపై గందరగోళం వల్ల, వ్యాపార సంస్థలు మొదటి మూడు నెలల్లో ఇన్‌పుట్ క్రెడిట్ ని పూర్తిగా వినియోగించుకోలేకపోయాయని, ట్రాన్సిషనల్ క్రెడిట్ క్లైమ్ చేయడంలో అప్పట్లో కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయని బిపిన్  సప్రా చెప్పారు. అక్టోబరు-డిసెంబరు క్వార్టరులో ఈ క్లైమ్‌లు విజృంభించడంతో ఆ నెలలకు వసూళ్ళు తగ్గాయి. కానీ, మొదటి మూడు నెలలకు సంబంధించిన క్లైమ్‌లు సడలినందువల, ఇప్పటి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లలో చాలా భాగం వర్తమానానికి చెందినవేనని సప్రా తెలిపారు. క్యాపిటల్ గూడ్స్‌పై ఇన్‌పుట్ క్రెడిట్ క్లైమ్ చేయడంలో నిబంధనలలో తెచ్చిన మార్పు కూడా వసూళ్ళను ప్రభావితం చేసింది. సెంట్రల్ ఎక్సైజ్/సెన్ వ్యాట్ వ్యవస్థలో, వ్యాపార సంస్థలు మొదటి ఏడాదిలో చెల్లించిన పన్నుల్లో 50 శాతానికి మాత్రమే క్రెడిట్ క్లైమ్ చేసే అవకాశం ఉండేది. కానీ, జి.ఎస్.టిలో, వ్యాపార సంస్థలు మొదటి ఏడాదిలో 100 శాతం క్రెడిట్ క్లైమ్ చేయవచ్చు. అవి 100 శాతం ట్రాన్సిషనల్ క్రెడిట్‌ను కూడా క్లైమ్ చేయవచ్చు. పైగా, ఆరంభ నెలల్లో అవసరానికి మించి చెల్లించిన పన్ను రిఫండు ప్రభుత్వం వద్దనే ఉండిపోయింది. అవసరానికి మించి చెల్లించిన పన్నుల రిఫండులు, సర్దుబాట్లు ఇంచుమించుగా డిసెంబరు నెలలో మొదలయ్యాయి. పండుగలు, పెళ్ళిళ్ళ సీజన్ డిమాండ్, సంవత్సరాంత కొనుగోళ్ళు లేకపోతే  పన్ను వసూళ్ళలో హెచ్చు తగ్గులు ఇంకా తీవ్రంగా ఉండేవి. నవంబరు గణాంకాలు ఎప్పుడూ పేలవంగానే ఉంటాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీలో ప్రొఫెసర్ అయిన ఆర్.కవితా రావు చెప్పారు. పరోక్ష పన్ను వసూళ్ళకు డిసెంబరు ఎప్పుడూ మెరుగ్గానే ఉంటుంది. జనవరిలో దాఖలైన రిటర్నులు వసూళ్ళలో పునరుద్ధరణను కనబరచడానికి అదే కారణం. నిబంధనలు పాటించడం మెరుగుపడినకొద్దీ క్రమంగా వసూళ్ళు కూడా మెరుగుపడతాయని ఆమె భావిస్తున్నారు.  

Related Posts