YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

చైనాకు షాక్ మీద షాక్ లు

చైనాకు షాక్ మీద షాక్ లు

న్యూఢిల్లీ,  సెప్టెంబ‌ర్ 11, 
ఒకప్పుడు చైనా అంటే అన్ని దేశాలు భయపడేవి. చైనా కూడా చాలా దేశాలను ఆక్రమించింది. కొన్ని దేశాలను తన గుప్పిట్లో పెట్టుకొని నియంతృత్వం నడిపిస్తుంది. ఒకప్పుడు మన భూములని కూడా చైనాకి ఉచితంగా ధారపోశారు. కానీ మోడీ వచ్చాక పరిస్థితులు మారాయి. సరిహద్దుల్లో పరిస్థితులు చాలా మారాయి. ఇదివరకు సరిహద్దుల్లో పాకిస్థాన్ కానీ, చైనా కానీ ఎటాక్ చేస్తే ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చే వరకు వెయిట్ చేయాలి. కానీ మోడీ ప్రభుత్వం ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇవ్వడంతో సరిహద్దుల్లో మన దేశ ఆర్మీ విజయ పథకాలు ఎగరేస్తూ మన భూభాగాలను కాపాడుతున్నారు. గాల్వన్ ఘటనలో చైనా ప్రదర్శించిన దూకుడుకి భారత్ గట్టి సమాధానం చెప్పాలనుకుంది. ఈ సారి యుద్ధంతో కాకుండా ఆర్థికంగా చైనాని దెబ్బ తీయాలి అని మోడీ ఫిక్స్ అయ్యాడు. మోడీ ప్రధాని అయిన దగ్గర నుంచి అన్ని దేశాలు తిరిగి ప్రపంచ దేశాల అధినేతలతో మంచి సంబంధాలను ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు చాలా దేశాలు చైనాని ఎదుర్కోవడానికి మోడీకి మద్దతు ఇస్తున్నాయి.కరోనా వైరస్ చైనానే వ్యాప్తి చేపించిందని ఆరోపణలు వస్తున్నాయి. దాంతో పాటు భారత సరిహద్దుల్లో చైనా రోజు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. చైనా ప్రపంచంలోని చాలా దేశాలకు అన్ని రకాల సరుకులను ఉత్పత్తి చేస్తుంది.   దీంతో మోడీ ప్రపంచ దేశాలతో కలిసి చైనాని ఆర్థికంగా దెబ్బ తీసి ప్రపంచ కంపెనీలన్నీ భారత్ కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు.ఇప్పటికే చైనాకి చెందిన 200 లకు పైగా యాప్స్ ని బ్యాన్ చేసి చైనాకి భారీ నష్టాన్ని మిగిల్చింది కేంద్ర ప్రభుత్వం. అంతే కాకుండా భారత్ లో తయారు చేసుకోగల వస్తువులను చైనా నుంచి బ్యాన్ చేసింది. భారత ప్రయివేట్ కంపెనీలు కూడా చైనాకి ఇచ్చిన ఆర్డర్స్ అన్ని క్యాన్సల్ చేసాయి. దీంతో చైనాకి భారీ నష్టం ఏర్పడింది. భారత్ తో పాటు వేరే దేశాలు కూడా చైనాకి ఏ రకంగా కుదిరితే ఆ రకంగా షాక్ ఇస్తున్నాయి.అమెరికా కూడా కొన్ని చైనా ఉత్పత్తులపై బ్యాన్ విధించింది. ఆస్ట్రేలియా కూడా చైనా యాప్స్ ని నిషేదించింది. ఐఫోన్ కంపెనీ చైనా నుంచి భారత్ కి తరలి వస్తుంది. జపాన్ కంపెనీలు కూడా చైనా నుంచి భారత్ మరియు యూరప్ దేశాలకు వెళ్లిపోతామని ప్రకటించాయి. యూరప్ కి చెందిన కొన్ని పెద్ద కంపెనీలు చైనాలో తమ బిజినెస్ కార్యకలాపాలు ఆపేస్తామని చైనాని హెచ్చరించాయి. అరబ్ దేశాలు చైనాలో పెట్రోల్ బావుల కోసం పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకుంటామని ప్రకటించాయి.ఇటీవల పపువా న్యూ గినియా అనే ఒక చిన్న దేశం చైనా నేవి అధికారులని బంధించి చైనాకి గట్టి షాక్ ఇచ్చింది. ఇలా ప్రపంచ దేశాలన్నీ చైనాకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు యుద్ధం చేయడం వద్దు అనుకోని భారత్ తో కలిసి కొన్ని దేశాలు చైనాని ఆర్థికంగా దెబ్బ తీస్తున్నాయి. ఒక దేశాన్ని ఆర్థికంగా దెబ్బ తీస్తే యుద్ధ పరంగా కూడా నష్టం కలుగుతుంది. ఇటీవలే అమెరికా.. భారత్, ఆస్ట్రేలియా, జపాన్ లతో కలిపి క్వాడ్ అనే కొత్త కూటమిని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇవన్నీ ఇలాగే జరిగితే, మరోసారి కూడా మోడీనే ప్రధాని అయితే భారత్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది.    

Related Posts